సోషల్ మీడియాలో బాలయ్యపై భలే భలే మీమ్స్ వస్తుంటాయి. చాలా చాలా ట్రోల్స్ చేస్తుంటారు. బాలయ్య సినిమాలకు మార్కెట్ తగ్గిపోయింది అంటారు. బిజినెస్ లేదూ అంటారు. అనేవాళ్ళు వినేవాళ్ళు ఎందరున్నా.. హీరోగా బాలకృష్ణ క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. ఇమేజ్ ఇసుకంతైనా జారడం లేదు. ఈ జనరేషన్ డైరెక్టర్స్ హీరోగా బాలయ్య పొటన్షియాలిటీ అంటే ఏమిటో తెలిసి సరైన బ్లాక్ బస్టర్ బాలయ్యకి పడితే బాక్సాఫీసు దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని గ్రహించిన దర్శకులు, మరీ ముఖ్యంగా బాలయ్య సినిమాలు చూస్తూ బాలయ్య మాస్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఈ జనరేషన్ దర్శకులు బాలయ్య తో పని చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దాని ఫలితమే ఇది. అంటే..
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో BB3 చేస్తున్న విషయం తెలిసిందే. BB3 షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఈ జనరేషన్ డైరెక్టర్స్ తో వరసగా సినిమాలు లైనప్ సెట్ అవుతున్నాయి. క్రాక్ తో పెద్ద హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ BB3 తదుపరి చిత్రానికి కమిట్ అయిన విషయమూ తెలిసిందే. బాలయ్య - గోపీచంద్ కాంబో మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ తో అనిల్ రావిపూడి కాంబో సెట్ అయినట్లే. ఎందుకంటే అనిల్ రావిపూడి బాలకృష్ణ తో సినిమా చెయ్యాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. ఎప్పుడో బాలయ్యకి కథ కూడా వినిపించాడట అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి - బాలకృష్ణ కాంబో ఫిలిం ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు.
దిల్ రాజుకి తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితో సినిమాలు చెయ్యాలనే ఫ్యాషన్ ఉంది. ఆల్రెడీ సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు చేసాడు. బాలయ్య తో ఓ సినిమా చెయ్యాలి, చిరు తో ఓ సినిమా చెయ్యాలనేది దిల్ రాజు కల. ఇక నెక్స్ట్ జెనరేషన్ లో అంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్, తారక్ ఇలా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసాడు దిల్ రాజు. ఇక మొత్తం హీరోలందరి సర్కిల్ కంప్లీట్ చెయ్యాలి అంటే చిరు, బాలయ్య తో కూడా సినిమాలు చేస్తే దిల్ రాజు కల నెరవేరినట్లే. అందులో బాలయ్య తో తన ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ సెట్ అయ్యింది. అనిల్ రావిపూడి పటాస్ దగ్గర నుండి ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ ఇలా అన్ని సినిమాలు దిల్ రాజు బ్యానర్ చేసాడు. ప్రెజెంట్ తన డబుల్ హ్యాట్రిక్ ఫిలిం ఎఫ్ 3 కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు. ఇప్పడు దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య తో అనిల్ రావిపూడి సినిమా కూడా కన్ఫర్మ్ అయినట్లే.