అనిల్ రావిపూడి అంటే కామెడీ డైరెక్టర్ గా బాగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టి ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ చిత్రీకరణలోనే కాదు.. ఆయన ఆధ్వరంలో తెరకెక్కిన గాలి సంపత్ సినిమా ప్రమోషన్స్ లోను బాగా బిజీగా వున్నాడు. శ్రీ విష్ణు-రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో తెరకెక్కిన గాలి సంపత్ రేపు మహా శివరాత్రికి విడుదల కాబోతుంది. గాలి సంపత్ అంటే అనిల్ రావిపూడి, అనిల్ రావిపూడి అంటే గాలి సంపత్ అనేలా ఉన్నాయ్ ఆ సినిమా ప్రమోషన్స్. మరోపక్క మహానటి నాగ్ అశ్విన్ కూడా జాతి రత్నాలు అంటూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. స్వప్న దత్ - నాగ్ అశ్విన్ నిర్మాతలుగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతి రత్నాల ప్రమోషన్స్ జోరుగా ఉన్నాయి.
మరి ఆ ఇద్దరు డైరెక్టర్స్ అంటే అనిల్ రావిపూడి గాలి సంపత్ కి, అలాగే నాగ్ అశ్విన్ జాతి రత్నాలకు బ్యాక్ బోన్ లా నిలిస్తే.. శర్వానంద్ శ్రీకారం సినిమాని మాత్రం ఓ మంచి ప్రయత్నంగా వర్ణించాల్సిందే. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో, పంటలు పండక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తరుచు టీవీలో వింటున్నాం. ప్రస్తుతం ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేఖంగా రైతులు పోరాడుతున్న టైం లో శ్రీకారం మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం మంచి ప్రయత్నం అనే చెప్పాలి. క్లాస్ గా ఉద్యోగం చేసుకునే కుర్రాడు వ్యవసాయం చెయ్యడానికి ఎందుకు రెడీ అయ్యాడు, వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో పండించి రైతు కష్టాలను ఎలా తీర్చాడో శ్రీకారంలో చూపించబోతున్నారు. మరి ఇద్దరు డైరెక్టర్స్, ఓ మంచి ప్రయత్నంలో ఏది సక్సెస్ అవుతుందో.. మార్చ్ 11 న తేలిపోతుంది.