బాలకృష్ణ - బోయపాటి ఎంత పవర్ ఫుల్ క్రేజీ కాంబినేషనో.. సింహ, లెజెండ్ చిత్రాలకి చూసేసాం. మరి అంతే క్రేజీ, పవర్ ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ - జగపతి బాబు ది. లెజెండ్ సినిమాలో నువ్వా - నేనా అంటూ హీరో - విలన్ కేరెక్టర్స్ లో కొట్టుకున్న బాలకృష్ణ - జగపతి బాబు లు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం బాలయ్య అభిమానులకు ఉత్సాహాన్నివ్వబోతుంది. లెజెండ్ సినిమాతో పవర్ ఫుల్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసిన బోయపాటి కి జగపతి బాబు ఏం ఇచ్చినా ఋణం తీర్చుకోలేంతగా ఎదిగిపోయాడు. లెజెండ్ తర్వాత జగపతి బాబు విలన్ కేరెక్టర్స్ లో చెలరేగిపోయాడు.
మరోమారు బాలయ్య - బోయపాటి మూవీ లో జగపతి బాబు అనగానే మళ్ళీ విలన్ కేరెక్టర్ అనుకునేరు.. ఈసారి బాలయ్య కి కుడి భుజం లాంటి కేరెక్టర్ జగపతి బాబుకి ఇచ్చాడట బోయపాటి. జగపతి బాబు పాత్రే BB3 కి కీలకమైన మలుపు తిప్పే పాత్రగా ఉండబోతుంది అని, నెగెటివ్ షేడ్స్ కాకుండా.. ఈసారి జగపతి బాబుని పాజిటివ్ గా బాలకృష్ణ పక్కనే చూడబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఈసారి శ్రీకాంత్ బాలయ్యకి విలన్ గా కనిపించబోతున్నాడు. లెజెండ్ తో జగపతి బాబు కెరీర్ టర్న్ అయినట్లుగా శ్రీకాంత్ కూడా BB3 తర్వాత విలన్ పాత్రల్లో క్రేజ్ చూపిస్తాడేమో చూద్దాం.