Advertisementt

అలా రశ్మికకి పుష్ప లో ఛాన్స్ దక్కింది

Mon 08th Mar 2021 12:46 PM
allu arjun,pushpa movie,pushpa pan india film,rashmika,sukumar,telugu heroines,telugu language,bunny  అలా రశ్మికకి పుష్ప లో ఛాన్స్ దక్కింది
So Rashmi got a chance in the Pushpa అలా రశ్మికకి పుష్ప లో ఛాన్స్ దక్కింది
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఇది పెద్ద విషయం కాదు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ లాంటి హిట్ ఉంది రశ్మికకి. అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు అనుకుంటే.. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి రష్మిక క్రేజ్ సరిపోతుందా అని పెదవి విరచినవారూ లేకపోలేదు. అప్పటికి రష్మిక బాలీవుడ్ మూవీస్ ఒప్పుకోలేదు. కేవలం తెలుగు, తమిళ్ మూవీస్ చేసిన రశ్మికని సుకుమార్ పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్ళబోతున్నాడు.. పాప బాగా లక్కీగా అనుకున్నారు. అసలైతే పుష్ప లో రష్మిక ని హీరోయిన్ గా ముందు అనుకోలేదట. అల్లు అర్జున్ సుకుమార్ కి ఫోన్ చేసి ఓ తెలుగమ్మాయిని పుష్ప లో హీరోయిన్ గా తీసుకుందామని చెప్పాడట. దానికి సుకుమార్ కూడా షాకయ్యాడట. అంత పెద్ద హీరో తెలుగమ్మాయిని హీరోయిన్ గా తీసుకుందామని అడగడం సామాన్యమైన విషయం కాదని.

కానీ వేరే కారణాల వలన పుష్ప సినిమాలోకి రష్మికాని తీసుకోవాల్సి వచ్చింది  అని ఓ ఈవెంట్ లో సుకుమార్ చెబుతున్న మాట. తన సినిమాల్లో తెలుగు రాని హీరోయిన్స్ ని పెట్టుకుని చాలా ఇబ్బంది పడ్డా అని, రంగస్థలం సినిమాలో చూస్తే సమంత, ప్రకాష్ రాజ్ తప్ప మిగతా వారంతా తెలుగు వారే అని, కానీ ప్రకాష్ రాజ్, సమంత చాలా బాగా తెలుగు మాట్లాడతారని అందుకే వాళ్ళని తీసుకున్నాడట సుకుమార్. పర భాషా హీరోయిన్స్ తెలుగు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారో తనకి తెలుసు అని, ఇకపై తన సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కి చోటుంటుంది అని ఆ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు సుకుమార్.

So Rashmi got a chance in the Pushpa:

Bunny wants to be a Telugu girl, but we have

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ