ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. విజయవాడలో టిడిపి ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీ అర్చకపాలన సాగుతుంది అంటూ టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. ఏపీలో టిడిపి హవా తగ్గింది అనుకున్నారా.. లేదంటే మారేదన్నానా అంటూ టిడిపి అధినేత చంద్రబాబు విజయవాడ రోడ్ షో లో వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని కూతురు శ్వేతా మేయర్ పీఠానికి పోటీ చెయ్యడంతో.. టిడిపి నేతలు విజయవాడలో చంద్రబాబు ఆధ్వర్యంలో రోడ్ షో లో పాల్గొన్నారు. అమరావతి రాజధాని కోసం నేను పోరాడుతుంటే.. మీరు ఇంట్లో కూర్చున్నారు అంటూ విజయవాడ పాలకులపై విరుచుకు పడిన చంద్రబాబు.. వైసీపీ నేతల గూండా రాజ్యం సాగదని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలను, ప్రతిపక్షాన్ని భయపెడుతుంది అని.. ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నా కానీ, వైసిపి కి భయపడి కాదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ మంత్రులు పనికిమాలిన మంత్రులు, పంచాయతీ శాఖ మంత్రి పెద్ది రెడ్డి తనో పెద్ద రౌడీ అని అనుకుంటున్నాడు.. నేను రౌడీలకు రౌడీని.. రౌడీల గుండెల్లో నిద్రపోతాను. అంతేకాదు ఓ భూతు మంత్రి కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతగా టిడిపి ని తప్పించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. ప్రజల ఓటు హక్కుని దోపిడీ చేస్తున్నారు. జగన్ అరాచక పాలనకు స్వస్తి చెప్పి.. దోపిడీ పాలనకు అంతం పలికి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ని ఓడించాలంటూ విజయవాడ ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.