నాకు సంస్కారం ఉంది.. నాకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఉండరు.
ఈమాటన్నది ఎవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ. హిందూపూర్ లో పంచాయితీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో అసహనంగా ఉన్న బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హాట్ హాట్ గా కనిపిస్తున్నారు. తాను ప్రజా సేవలో ఉన్నానని తనని ఎవరైనా విమర్శిస్తే ఊరుకొనంటూ వైసిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తానూ హిందూపూర్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసానని, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి క్యాన్సర్ పేషేంట్స్ కి సేవలందిస్తున్నానని, సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నా అని.. తనకెన్నో పనులుంటాయని.. అలాగని తనని విమర్శిస్తే.. ఊరుకోనని వార్నింగ్ ఇస్తున్నారు.
వైసీపీ మంత్రులు బూతులు తిడతారని, వారికన్నా తనకి బాగా బూతులు తిట్టడం వచ్చని, తనకన్నా ఎక్కువ బూతులు ఎవరూ మాట్లాడలేరంటూ.. బాలయ్య తనని విమర్శిస్తున్న వైసీపీ మంత్రులకి హెచ్చరికలు జారీకి చేసారు. నేను నా గౌరవాన్ని కాపాడుకుంటాను, అదే సమయంలో ఎవరైనా నన్ను విమర్శిస్తే ఊరుకోను, నాకు సంస్కారం ఉంది. కాబట్టే బూతులు తిట్టడం లేదు అంటూ వైసిపి నాయకులను హిందుపూర్ రోడ్ షో లో ఏకిపారేశారు బాలయ్య.