రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ - తారక్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫేర్స్ ఆధ్వర్యంలో ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించి బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది ఆర్.ఆర్.ఆర్ టీం. అక్కడ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ తన మైదాన్ మూవీని అక్టోబర్ 15 అని ఎప్పుడో డేట్ ఇవ్వడంతో రాజమౌళి - బోని కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయి. బోని కపూర్ రాజమౌళికి విచక్షణ లేదంటూ నానా మాటలను అంటున్నారు.
అయితే రాజమౌళి మాత్రం ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా.. ఆర్.ఆర్.ఆర్ డేట్ కి నాకు సంబందం లేదు.. అది నిర్మాతల పని అంటూ చల్లగా జారుకున్నారు. అయినా బోని రాజమౌళి మీదే విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా రాజమౌళి ఇప్పుడు అనుకున్న డేట్ కి ఆర్.ఆర్.ఆర్ ని దింపలేకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారీ ప్రాజెక్ట్, విఎఫెక్స్ పనులు దానికి తోడు రాజమౌళి అవుట్ ఫుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా లొకేషన్స్ లోనే షూటింగ్ చేసుకుంటున్న ఆర్.ఆర్. ఆర్ కి చాలా తక్కువ టైం ఉంది. అందుకే అనుకున్న టైం కి ఆర్.ఆర్.ఆర్ రాకపోవచ్చనే న్యూస్ మొదలైంది. ఒకవేళ అక్టోబర్ కి సినిమా విడుదల కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికే ఆర్.ఆర్.ఆర్ ఉండొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి రాజమౌళి బోనీ ఎన్ని మాటలన్నా తగ్గని వాడు.. ఇప్పుడు వర్క్ విషయంలో తగ్గుతాడా? ఏమో చూద్దాం.