Advertisementt

చరణ్ - పూజ పై గుర్రుగా ఉన్న కొరటాల?

Sat 06th Mar 2021 10:53 AM
ram charan,sidda,acharya,sidda as ram charan,charan completes acharya shooting,ram charan and upasana at airport  చరణ్ - పూజ పై గుర్రుగా ఉన్న కొరటాల?
Ram Charan Completes Acharya Shooting చరణ్ - పూజ పై గుర్రుగా ఉన్న కొరటాల?
Advertisement
Ads by CJ

కొరటాల శివ - చిరు కాంబోలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో 20 రోజుల భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సిద్ధగా తన కేరెక్టర్ కి సంబందించిన సన్నివేశాలను ఆచార్య లో పూర్తి చేసుకుని నిన్ననే ఆచార్య షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసాడు. అయితే కొరటాల శివ ఎంతో ఉత్సాహం గా ఆచార్య అప్ డేట్స్ ఇద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక గందర గోళం జరుగుతుంది. అంటే ఆచార్య టైటిల్ విషయంలో చిరంజీవి గారు ఏదో ఈవెంట్ కి అతిధిగా వెళ్లి అక్కడ ఆచార్య టైటిల్ ని రివీల్ చేసి కొరటాలకు షాకిచ్చారు. గ్రాండ్ గా టైటిల్ ఇద్దామనుకుంటే చిరు అట్లా చేసారు. టీజర్ విషయంలోనూ చిరు కొరటాలని ఏడిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య సెట్ లోకి అడుగుపెట్టిన విషయం ప్రకటనతో తెలియజేసారు.

కానీ సిద్ధగా ఆచార్య కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ సైలెంట్ గా వెళ్లిపోకుండా ఆచార్య 20 డేస్ షూటింగ్ కంప్లీట్ అంటూ భార్య ఉపాసనతో కలిసి హంగామా చేస్తూ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఆచార్య షూటింగ్ షెడ్యూల్ రామ్ చరణ్ ముగించేసాడనే విషయం అందరికి తెలిసిపోయింది. మరో పక్క రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటించబోతుంది అనే న్యూస్ ఉన్నా.. అది అధికారికంగా ప్రకటించలేదు. కానీ పూజ హెగ్డే ఆచార్య షూటింగ్ కపిలేట్ చేసినట్టుగా ఓ పిక్ పోస్ట్ చెయ్యడంతో కొరటాల ప్రకటించకుండానే పూజ హెగ్డే ఆచర్యలో రామ్ చరణ్ పక్కన నటిస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. మరి కొరటాల ఏదో ఒక విధంగా ఆచార్య అప్ డేట్ ఇద్దామనే అనుకుని ఉంటాడు. కానీ రామ్ చరణ్ - పూజ ఇలా అందరికి తెలిసేలా చేసేసరికి పూజ- చరణ్ పై కొరటాల గుర్రుగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి. కొరటాల: ఏదో క్రేజీగా అప్ డేట్ ఇద్దామనుకున్నా.. కానీ రామ్ చరణ్ ఇలా పబ్లిక్ గా విషయం చెప్పేసాడు. ఇంకేం చేస్తాం అంటూ కొరటాల తలపట్టుకున్నట్టుగా మీమ్స్ సోషల్  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మీమ్స్ చూసి నెటిజెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Ram Charan Completes Acharya Shooting:

Ram Charan Completes Acharya Shooting and spotted at airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ