బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కి బోలెడన్ని సినిమా అవకాశాలు, స్టార్ మా స్పెషల్ ప్రోగ్రాం లో అభిజిత్ యాంకర్ గా అంటూ బిగ్ బాస్ నుండి అభిజిత్ బయటికి రాకముందు నుండే తెగ ప్రచారం జరిగింది. కానీ అభిజిత్ విన్నర్ గా బయటికి వచ్చి నెలలు గడుస్తున్నా అభిజిత్ నుండి స్పెషల్ న్యూస్ ఏది మీడియాకి కానీ అభిమానులకి కానీ దొరకలేదు. మరోపక్క సోహెల్, అఖిల్, మోనాల్ సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నా అభిజిత్ మాత్రం కామ్ గానే ఉంటున్నాడు. సోహెల్ అంత అభిజిత్ ఫెమస్ అవ్వడం లేదు. మొన్నామధ్యన అభిజిత్ కథలు వింటున్నాడు, ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాడనే టాక్ నడిచినా అందులో నిజం లేదని తొందరగానే క్లారిటీ వచ్చేసింది.
అయితే తాజా న్యూస్ ఏమిటి అంటే నాగార్జున బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి ఓ అదిరిపోయే భారీ డీల్ ఇచ్చినట్టుగా టాక్ మొదలైంది. నాగార్జున అభిజిత్ తో మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్టుగా, అందులో ఓ కొత్త దర్శకుడితో అభిజిత్ సినిమా ఫైనల్ అవడం, దానికి నాగ్ పెట్టుబడి పెట్టడం అన్ని ఓకె అయిపోయినట్లుగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున అభిజిత్ తో సినిమాలు నిర్మించబోతున్నాడట. ఇక నాగ్ - అభిజిత్ మూవీ అనౌన్సమెంట్ త్వరలోనే ఉంటుందట. మరి బిగ్ బాస్ కి ముందు అప్పుడెప్పుడో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పెళ్లిగోల వెబ్ సీరీస్ లో నటించిన అభిజిత్ మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ నుండే హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట.