నాని 25 వ సినిమాగా ప్రోజెక్ట్ చేస్తూ పబ్లిసిటీ చేసి సినిమా మీద భారీ క్రేజ్ పెంచేసిన వి సినిమా టీం కి లాక్ డౌన్ దెబ్బ పడింది. సుధీర్ బాబు హీరో గా నాని విలన్ గా ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే విడుదల కావాల్సి ఉంది. అయితే థియేటర్స్ బంద్ అవడంతో నాని 25 వ సినిమా కాస్తా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన వి సినిమా సో సో టాక్ తెచ్చుకుని ప్లాప్ లిస్ట్ లో చేరింది. ఓకె.. అయ్యింది ఏదో అయ్యింది అనుకుంటే.. ఆఖరికి బుల్లితెర మీద వి సినిమాకి వీక్ టీఆర్పీ రావడంతో ఓవరాల్ గా వి సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది.
వి సినిమా ప్లాప్ అవడం తో నాని కామ్ అయినా.. వి సినిమాకి ఇంకా కష్టాలు తొలగలేదు. కారణం బాలీవుడ్ నటి ఒకరు తన ఫోటో ని అనుమతి లేకుండా వి సినిమాలో వాడుకున్నారంటూ కోర్టుకెక్కింది. బాలీవుడ్ నటి సాక్షి మాలిక్.. వి సినిమాలో తన అనుమతి లేకుండా ఓ సందర్భంలో మొబైల్ ఫోన్‌లో తన ఫోటో ని కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా చూపించారని.. తన అనుమతి లేకుండా తన ఫొటోను వాడి తన పరువుకు భంగం కలిగించారని సాక్షి మాలిక్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. వి నిర్మాతలపై పరువు నష్టం దావా వేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో ఆమె అనుమతి లేకుండా సాక్షి ఫోటో వాడడం ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమే అంటూ.. ఓటిటి నుండి వి సినిమాని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.