ఇప్పుడు యాంకర్స్ అందరిలో వెండితెర మీద ఆఫర్స్ వెల్లువలో దూసుకుపోతూ బిజీ అయిన అనసూయ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంది. అయితే తాను నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతున్న అనసూయ ని ఓ అభిమాని మీరు ఐటెం సాంగ్స్ లో నటించను అన్నారుగా కానీ చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ లో ఎలా నటించారు అని అడగగానే తెగ ఫైరై పోయింది అనసూయ. ఐటెం సాంగ్ అంటావేమిటి. అది స్పెషల్ సాంగ్ అంతే. ఐటెం సాంగ్ అనొద్దు. ఒక సినిమాలో నటీనటులంతా ఉంటారు.. కానీ స్పెషల్ గా ఓ గీతం ఉంటుంది అందులో డాన్స్ చేస్తే ఐటెం అయిపోరు.. అంటూ ఎగిరెగిరి పడింది.
గతంలో అనసూయ సాయి ధరమ్ విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అప్పుడు అలానే ఐటెం అంటారెందుకు స్పెషల్ సాంగ్ అనండి అంటూ చిందులు తొక్కింది. మళ్ళీ ఇప్పుడు. ఇక తాను స్పెషల్ సాంగ్స్ చెయ్యను అని చెప్పలేదంటుంది. ఎప్పుడూ స్పెషల్ సాంగ్స్ ని ఐటెం సాంగ్స్ అనొద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది అనసూయ. తనకు చావు కబురు చల్లగా స్పెషల్ సాంగ్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పింది. ఆ పాట లిరిక్స్ బావున్నాయని, తనకి నచ్చాయని, జానీ మాస్టర్ అడిగారని అందుకే స్పెషల్ సాంగ్ చేశాను అంటూ క్లారిటీ ఇచ్చింది.