Advertisementt

ఆర్.ఆర్.ఆర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్

Wed 03rd Mar 2021 08:52 PM
rrr,ram charan,rajamouli,ntr,tarak  ఆర్.ఆర్.ఆర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్
RRR Full Action Package ఆర్.ఆర్.ఆర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు లవ్ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, ఎమోషనల్ అయినా ఏదైనా అన్ని సమపాళ్లలో ఉంటాయి. వేటికవే ప్రత్యేకతతో కూడుకున్నవి. బాహుబలిలో ప్రేమ, పగ, ద్వేషం, యాక్షన్ అన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ కూడా ప్రేక్షకులకు, ఫాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. బాహుబలిలో మెయిన్ హైలెట్ ప్రేమ, రొమాన్స్ కన్నా యాక్షన్ సన్నివేశాలే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలోను అదే వినిపిస్తుంది. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ తో జక్కన్న క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ చిత్రీకరణలో బిజీగా వున్నారు.

ఎన్టీఆర్ హీరోగా అయితేనే అతని ఫాన్స్ ఎన్టీఆర్ యాక్షన్ పార్ట్ పై పెట్టుకునే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు., అలాగే రామ్ చరణ్ సోలోగా యాక్షన్ సన్నివేసాలకు మెగా ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. మరి ఆ ఇద్దరు స్టార్స్ ఒకే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటే ఆ పార్ట్ ఎంత ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఊహకు అందదు. అలాంటి పోరాట ఘట్టాలను రాజమౌళి విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫ‌ర్ల‌ సహాయంతో చిత్రీకరిస్తున్నారట. ఈ క్లైమాక్స్ సీన్స్ కోసం జక్కన హాలీవుడ్ నుండి ఓ టీం నే దింపేసాడట. హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన నిక్ పావెల్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి యాక్షన్ కొరియోగ్రాఫేర్ గా ప‌ని చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాల్సిందే. మరి ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫేర్ నిక్ పావెల్ ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తలమునకలైన వీడియోని ఆర్.ఆర్.ఆర్ టీం ట్విట్టర్ లో షేర్ చేసింది.

RRR Full Action Package:

RRR Full Action Package

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ