Advertisementt

రిజల్ట్ తో పని లేని రిలేషన్ ఇది

Tue 02nd Mar 2021 11:06 PM
raj tarun,vijay kumar konda,third movie,power play movie,orey bujjiga movie  రిజల్ట్ తో పని లేని రిలేషన్ ఇది
This is a relationship that does not work with the result రిజల్ట్ తో పని లేని రిలేషన్ ఇది
Advertisement
Ads by CJ

ఒరేయ్ బుజ్జిగా సినిమా రిలీజ్ కాక ముందే మరో సినిమాని ఎనౌన్స్ చేసిన కాంబినేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా - హీరో రాజ్ తరుణ్ ది, ఒరేయ్ బుజ్జిగా మూవీ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ మీదకి వచ్చి లాక్ డౌన్ టైం లో పర్లేదు అనిపించుకుంది. ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదల అవ్వకుముందే మరో సినిమాని ప్రకటించిన విజయ్ కుమార్ కొండా - రాజ్ తరుణ్ లు ఆ సినిమాని కూడా పూర్తి చేసారు. వారి కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కిన పవర్ ప్లే మార్చ్ 5 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పవర్ ప్లే ప్రమోషన్స్ లో ఉన్నారు రాజ్ తరుణ్ అండ్ టీం. అయితే రెండో సినిమా పవర్ ప్లే విడుదల కాకముందే మూడో సినిమాకి రెడీ అయ్యిపోయింది ఈ జంట. మూడో సినిమా కూడా స్టార్ట్ చేసేసారు.

మూడో సినిమా వర్క్ కూడా స్టార్ట్ అయ్యిపోయింది. పవర్ ప్లే రిజల్ట్ తో కూడా సంబంధం లేకుండా వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన ఆ బాండింగ్, ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది. పవర్ ప్లే కి పెట్టిన బడ్జెట్ చాలా హ్యాపీగా ఈజీగా వర్కౌట్ అయ్యిపోతుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు పవర్ ప్లే మేకర్స్. ఇక నెక్స్ట్ మూవీ ని మరో కొత్త జోనర్ లో ట్రై చెయ్యబోతున్నారు. రాజ్ తరుణ్ కి అది మరో ఎక్సపెరిమెంటల్ ఫిలిం అవ్వబోతుంది. 

This is a relationship that does not work with the result:

Raj Tarun and Vijay Kumar Konda are ready for the third movie before the release of Power Play

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ