Advertisementt

కోటి వ్యూస్ వస్తే కోర్టుకి వెళ్ళక్కర్లేదా.?

Tue 02nd Mar 2021 03:03 PM
shanmukh,youtube star,social media,drunk and drive accident  కోటి వ్యూస్ వస్తే కోర్టుకి వెళ్ళక్కర్లేదా.?
Don't you want to go to court if you get a million views? కోటి వ్యూస్ వస్తే కోర్టుకి వెళ్ళక్కర్లేదా.?
Advertisement
Ads by CJ

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్ వలన కార్లు డ్యామేజ్ అవ్వడమే కాదు.. ఓ స్కూటరిస్ట్ కూడా గాయపడడంతో.. ఆ స్కూటరిస్ట్ ఇచ్చిన కంప్లైంట్ తో షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించగా.. అక్కడ షణ్ముఖ్ రచ్చ రచ్చ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో షణ్ముఖ్ వీరంగం ఆడుతూ.. నేను చేసే వెబ్ సీరీస్ కి, షార్ట్ ఫిలిమ్స్ కి కోటి వ్యూస్ వస్తాయి తెలుసా? అలాంటి నన్ను కోర్టుకి తీసుకెళ్తారా? డబ్బులిస్తాను మాట్లాడుకుందాం.. అయినా ఎవరికీ దెబ్బలు తగిలి హాస్పిటల్ కి వెళ్ళలేదు కదా అంటూ రచ్చ చేసి పోలీస్ ల మీద చిందులు వేసిన వీడియోస్ యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి.

యూట్యూబ్ స్టార్ గా నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఎమ్ చేసినా చెల్లుతుందా అంటూ నెటిజెన్స్ షణ్ముఖ్ పై విరుచుకుపడుతున్నారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఏం మెసేజ్ ఇద్దామని.. ఇలాంటి యాక్సిడెంట్స్ చేస్తున్నావ్ అంటూ నెటిజెన్స్ షణ్ముఖ్ పై ఫైర్ అవుతున్నారు. మరి కోటి వ్యూస్ వస్తే కోర్టుకు వెళ్ళారా? అయితే డబ్బులిస్తాను మాట్లాడుకుందాం అంటూ మందు మత్తులో మాట్లాడిన షణ్ముఖ్ మందు మత్తు దిగినాక రియలైజ్ అయ్యాడు. 

Don't you want to go to court if you get a million views?:

Shanmukh caught in drunk and drive accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ