Advertisementt

ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు

Mon 01st Mar 2021 05:07 PM
ram charan look as siddha,acharya movie,ram charan,acharya sidda,koratala shiva  ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు
Ram Charan Siddha Look In Acharya ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ రంపచోడవరం అడవుల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అక్కడే ఆ ఫారెస్ట్ లో ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ సిద్ద గా చిరు కాంబో సీన్స్ లో పాల్గొంటున్నాడు. ఆచార్యగా చిరు - సిద్ద గా రామ్ చరణ్ కాంబో సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు. అయితే ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ సిద్ద గా ప్రీ లుక్ లో ఎప్పుడో దర్శనమిచ్చాడు. తాజాగా సిద్ధగా రామ్ చరణ్ లుక్ చాలా వరకు రివీల్ చేసి.. ఆచార్య సిద్ధ మవుతున్నాడు అంటూ టీం ఏదో సస్పెన్స్ క్రియేట్ చేసింది.

రామ్ చరణ్ ఆచర్యలో నటిస్తున్నాడు అనగానే సినిమాపై మంచి అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు రామ్ చరణ్ సిద్ద లుక్ లో కనిపించిన తీరుతో రామ్ చరణ్ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే మహాశివరాత్రి రోజున ఆచార్య కి సంబందించిన రామ్ చరణ్ పాత్రని ఏమైనా రివీల్ చేస్తారేమో.. అందుకే ఆచార్య సిద్ధ మవుతున్నాడు అంటూ ప్రకటించింది టీం. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ భుజంపై చిరు ఆచార్య చెయ్యి కనిపిస్తుండగా.. ఎదురుగా తుపాకీ పెట్టి ఉంది. దానిని బట్టి ఆచార్య గా చిరు, సిద్ధగా రామ్ చరణ్ లు నక్సలైట్ కేరెక్టర్స్ లో కనిపిస్తారేమో అనే ప్రచారానికి ఊతమిస్తుంది ఈ సిద్ద పోస్టర్. మరి రామ్ చరణ్ సిద్ద కేరెక్టర్ కి సంబందించిన ఏదైనా టీజర్ ఉండొచ్చనే ఊహాగానాలు ఫాన్స్ లో మొదలయ్యాయి. మరి కొరటాల సిద్ద కేరెక్టర్ పై ఏం ప్లాన్ చేసాడో చూద్దాం. 

Ram Charan Siddha Look In Acharya:

Charan Look As Siddha In Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ