Advertisementt

అఖిల్ vs ఆకాష్ పూరి

Mon 01st Mar 2021 01:24 PM
most eligible bachelor,romantic,akhil,akash puri,most eligible bachelor vs romantic,akhil vs akash  అఖిల్ vs ఆకాష్ పూరి
Most Eligible Bachelor Vs Romantic అఖిల్ vs ఆకాష్ పూరి
Advertisement
Ads by CJ

అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని ఈ సంక్రాంతికి విడుదల చేద్దామనుకుని.. తర్వాత మే లో రిలీజ్ అనుకుని చివరికి జూన్ 19 న విడుదల చేసేందుకు రీసెంట్ గానే డేట్ లాక్ చేసారు. మే, జూన్ ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ హడావిడి ముగియగానే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో దిగుతున్నాడు.. అఖిల్ కి బాగా కలిసొస్తుంది అనుకుంటే ఇప్పుడు అఖిల్ కి పోటీగా డైరెక్టర్ పూరి కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ తో అడ్డం పడుతున్నాడు. ఆకాష్ పూరి రీసెంట్ మూవీ రొమాంటిక్ ని జూన్ 18న రిలీజ్ చేస్తున్నట్లుగా తాజాగా డేట్ ప్రకటిచింది యూనిట్.

డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్న రొమాంటిక్ మూవీ కి పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆకాష్ పూరికి జోడిగా కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ కి తగ్గ రేంజ్ లోనే రొమాంటిక్ పోస్టర్స్ ఉన్నాయి. ఆకాష్ పూరి - కేతిక శర్మ ల రొమాన్స్ సినిమాకి హైలెట్ గా నిలవనుంది అనేది రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో టైటిల్‌కు న్యాయం చేస్తూ.. న‌డుస్తున్న బ‌స్ డోర్ ద‌గ్గ‌ర‌ హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక ఓ ముఖ్య పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఇంటెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

మరి అఖిల్ జూన్ 19 అంటే.. ఆకాష్ జూన్ 18 అంటూ ఒక్క రోజు ముందు తన రొమాంటిక్ డేట్ ఇవ్వడం చూస్తుంటే.. అఖిల్ తో పోటీకి సై అంటే సై అన్నట్లే కనబడుతుంది వ్యవహారం. మరి రెండు సినిమాలు యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలే కావడంతో.. ఇద్దరి మధ్యన ఫైట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే కనబడుతుంది.

Most Eligible Bachelor Vs Romantic:

Akhil - Akash Puri 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ