అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ కేరళ లో జరుగుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఢీ కొట్టబోయే కేరెక్టర్ ని సుకుమార్ ఇంకా రివీల్ చెయ్యలేదు. లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపించబోతున్న పుష్ప రాజ్ అల్లు అర్జున్ కి సమఉజ్జిగా నిలబడే విలన్ కేరెక్టర్ ని సుక్కు ఇంకా సెట్ చెయ్యలేదో.. ఏమో కానీ ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొరటాల శివ సినిమా లో అల్లు అర్జున్ ని ఢీ కొట్టబోయేది ఎవరో అనేది దాదాపుగా రివీల్ అయ్యింది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో పాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబోలో నటించబోయే హీరోయిన్ విషయం తేలలేదు కానీ.. ఓ కీలక పాత్రకి అంటే దాదాపుగా అల్లు అర్జున్ ఢీ కొట్టబోయే పాత్ర కోసం క్రాక్, నాంది సినిమాలతో అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ని సంప్రదిస్తున్నారని.. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లుగా టాక్ వినిపిస్తుంది. దాదాపు వరలక్ష్మి శరత్ కుమార్ అల్లు అర్జున్ - కొరటాల మూవీ లో కన్ఫర్మ్ అని.. కాకపోతే అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. నాంది లో ఆద్య గా లాయర్ కోటుతో కోర్టు సీన్స్ లో అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, క్రాక్ సినిమాలోనూ అద్భుతంగా నటించింది. మరి ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలో అదిరిపోయే విలన్ రోల్ లోనే వరలక్ష్మి కనిపించబోతుంది అనేది సోషల్ మీడియా టాక్.