ప్రభాస్ అప్ కమింగ్ ఫిలిం రాధేశ్యామ్ కోసం ఎంటైర్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. బాహుబలి తర్వాత ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన సాహో పాన్ ఇండియా ఫిలిం మన తెలుగు ఆడియన్స్ ని మాత్రం మెప్పించలేకపోయింది కానీ నార్త్ ఆడియన్స్ చేత పర్లేదు అనిపించుకుంది. అయితే సాహో సినిమాకి జరిగిన డ్యామేజ్ ఏమిటి అంటే.. ఎక్కువ బడ్జెట్. అనుకోని బడ్జెట్ పెట్టుకుంటూ వెళ్లడం వలన దాదాపు 60 కోట్ల మైనస్ లో ఉండిపోయింది సాహో ప్రాజెక్ట్. దానికి సంబందించిన యూవీ క్రియేషన్స్ ని తన సొంత బ్యానర్ గా భావించే ప్రభాస్ ఆ సాహో సినిమాకి సంబంధించి చేసిన సంతకాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు రాధేశ్యామ్ తో సాహో లోటుని కవర్ చేసే ప్రయత్నాలు మొదలైనాయి.
గతంలో సాహో సినిమా టైం లో విపరీతమైం కాన్ఫిడెన్స్ తో ఉన్న యూవీ క్రియేషన్స్ ప్రమోద్ మరియు వంశీలు బిజినెస్ విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టుకుని కూర్చెనేవారు. కానీ ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో వచ్చే ఆఫర్స్ ని చూసుకుని వీలైనంత వరకు బిజినెస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎలా అంటే ఎక్కడా ఏ ఏరియాని వారి చేతుల్లో ఉంచుకోవడం లేదు. అంటే సాహో కొన్ని చోట్ల యూవీ క్రియేషన్స్ వారు అతి నమ్మకంతో సొంతగా రిలీజ్ చేసి దెబ్బతిన్నారు కాబట్టి.. ఈసారి రాధేశ్యామ్ ఏ ఏరియాని తమ కింద ఉంచుకోకుండా అన్ని ఏరియాలను అమ్మెయ్యడానికి చూస్తున్నారు. వచ్చిన రేట్లలో బెటర్ ఆఫర్స్ చూసుకుని రాధేశ్యామ్ ని అమ్మేస్తున్నారు రాధేశ్యామ్ నిర్మాతలు. ఈ రకంగా ఖచ్చితంగా సాహో లోటు రాధేశ్యామ్ పూడ్చేస్తుంది అని వారి నమ్మకం అన్నమాట.