Advertisementt

బిజినెస్ లాస్ అయినా జీతాలిచ్చిందట

Sun 28th Feb 2021 10:12 PM
rakul preet singh,check movie,rakul gym,gym business,check promotions  బిజినెస్ లాస్ అయినా జీతాలిచ్చిందట
Rakul Preet Singh far from Check Promotions బిజినెస్ లాస్ అయినా జీతాలిచ్చిందట
Advertisement
Ads by CJ

కరోనా లాక్ డౌన్ లో చాలామందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సినిమా పరిశ్రమ కుదేలైంది. అయితే కొంతమంది వ్యాపారాలలో నష్టపోయినా ఉద్యోగులకు జీతాలిచ్చారు. మరికొంతమంది లాస్ లో వ్యాపారాలు నడపలేక ఉద్యోగులను ఉద్యోగం నుండి తీసేసారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం వ్యాపారంలో నష్ట పోయినా కూడా ఉద్యోగాలకు జీతాలిచ్చాను అంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ లో బాగా బిజీ అయిన రకుల్ ప్రీత్ గతంలో అంటే టాలీవుడ్ లో బిజీ తారగా ఉన్నప్పుడే 45 జిమ్ అంటూ జిమ్ వ్యాపారం మొదలు పెట్టింది. ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టే రకుల్ ప్రీత్.. జిమ్ వ్యాపారంలో దూసుకుపోయింది.

వైజాగ్, హైదరాబాద్ లలో చాలా బ్రాంచ్ లు ఓపెన్ చేసింది రకుల్. కానీ కరోనా లాక్ డౌన్ వలన రకుల్ జిమ్ వ్యాపారం నష్టాల్లో పడిపోయిందట. చెక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ మట్లాడుతూ.. చెక్ సినిమాలో మానస పాత్ర చేసిన తనకి మంచి పేరు వచ్చింది అని, అలాగే క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండబోతుంది అని చెప్పిన రకుల్.. లాక్ డౌన్ ప్రభావం జిమ్ వ్యాపారంపై బాగా పడింది. లాక్ డౌన్ లో కొన్నాళ్ల పాటు జిమ్‌లు మూతపడినా అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులకి జీతాలు మాత్రం ఆపలేదని.. టైం టు టైం జీతాలు ఇచ్చేసానని చెప్పింది. కరోనా ముగిసి మళ్లీ జిమ్ వ్యాపారం ఊపందుకుందని తెలిపింది రకుల్..

Rakul Preet Singh far from Check Promotions:

Rakul Preet Singh far from Check Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ