Advertisementt

పవన్ కి మహేష్ తో తలపడక తప్పట్లేదు

Sun 28th Feb 2021 03:17 PM
pawan kalyan,krish movie,mahesh babu,sarkaru vaari paata,parasuram,sankranthi fight,sankranthi 2022  పవన్ కి మహేష్ తో తలపడక తప్పట్లేదు
Pawan Kalyan vs Mahesh Babu పవన్ కి మహేష్ తో తలపడక తప్పట్లేదు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. దిల్ రాజు బ్యానేర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ రిలీజ్ కి సిద్ధమవుతుంటే.. ఆయన నటిస్తున్న మరో మూవీ అయ్యప్పన్ కోషియమ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో PSPK 27 షూటింగ్ లో బిజీగా వున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గజ దొంగగా నటిస్తున్న PSPK 27 టైటిల్ గా హరిహర వీరమల్లు ప్రచారం లో ఉండగా.. మహాశివరాత్రి రోజున పవన్ PSPK 27 టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. రీసెంట్ గా PSPK 27 మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది టీం. పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో PSPK 27 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానితో పవన్ కళ్యాణ్ కి మహేష్ కి వార్ షురూ అయ్యింది.

ఎందుకంటే మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి కి విడుదల చేస్తామంటూ పరశురామ్ డేట్ లాక్ చేసి ముందుగానే గ్రాండ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 2022 సంక్రాంతికి వార్ షురూ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ తో పాటుగా సెప్టెంబర్ 9 న ఏకే రీమేక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉండగా ఇపుడు క్రిష్ సినిమాని 2022 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మహేష్ తో ఫైట్ చేసేందుకు సిద్దపడాల్సి వచ్చింది. మరి పరశురామ్ తో మహేష్ సర్కారు వారి పాట పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సంక్రాంతి వార్ లో ఎవరు విన్నర్ అవుతారో వారే టాలీవుడ్ నెంబర్ వన్ అవుతారు అంటూ అప్పుడే పవన్ ఫాన్స్ తో పాటు మహేష్ ఫాన్స్ సోషల్ మీడియా రచ్చ మొదలైపోయింది.

Pawan Kalyan vs Mahesh Babu:

Pawan Kalyan - Krish Movie to release Sankranthi 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ