Advertisementt

జబర్దస్త్ లో భారీ మార్పులు

Sat 27th Feb 2021 09:34 PM
jabardasth show,e tv,anasuya,roja,rashmi gautham,jabardasth changes  జబర్దస్త్ లో భారీ మార్పులు
Huge changes in Jabardasth జబర్దస్త్ లో భారీ మార్పులు
Advertisement
Ads by CJ

ఈటీవీలో గురువారం, శుక్రవారం ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు బుల్లితెరకు జబర్దస్త్ షో నుండే కామెడీ షోస్ కి గిరాకీ పెరిగింది  జబర్దస్త్ ని కొట్టేద్దాం, పడుకోబెట్టేద్దాం అంటూ వచ్చిన ఏ షో కూడా నిలబడింది లేదు. అన్నీ మూలాన పడ్డాయి. అప్పటికి ఇప్పటికి.. ఎనిమిదేళ్ల నుండి జబర్దస్త్ షో రారాజుగానే వెలుగుతోంది. అనసూయ, రష్మీ గౌతమ్ లు గ్లామర్ తో జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి స్పెషల్ గ్లామర్ తెస్తుంటే.. జేడ్జ్ రోజా కూడా అనసూయ - రష్మిల తో పోటీగా గ్లామర్ షో చేస్తుంది. అయితే కొన్నాళ్లుగా ఎదురు లేని జబర్దస్త్ షో లో నాగబాబు వెళ్లిపోవడం, కిర్రాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లు బయటికి వెళ్లిపోవడంతో సుడిగాలి సుధీర్, ఆది స్కిట్స్ తోనే జబర్దస్త్ లాగించేస్తున్నారు.

గంటన్నర పాటు ఆరు స్కిట్స్ తో గురు, శుక్రవారాల్లో ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నడిచేది. తక్కువ కామెడీ ఉన్న స్కిట్స్ ని షో మొదట కానీ, చివరిలో కానీ ప్రసారం చేస్తూ మధ్యలో టాప్ స్కిట్స్ ని వేస్తూ ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ లో భారీ మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ముందుగా షో టైమింగ్స్ లో కోత పెట్టడం స్టార్ట్ చేసారు. ఈ గురు, శుక్రవారాల్లో కేవలం గంట జబర్దస్త్ షో వేశారు. తర్వాత అరగంట జబర్దస్త్ లో సూపర్ హిట్ అయిన స్కిట్స్ వేసుకుంటున్నారు. మరో పక్క ఆరు స్కిట్స్ కి బదులు కేవలం ఐదు స్కిట్స్ మాత్రమే వేస్తున్నారు. అయితే కొంతమందిని టీం లీడర్స్ నుండి తప్పించి మరికొన్ని టీమ్స్ లో కలిపెయ్యడం, అలాగే కొన్ని టీమ్స్ ని తీసేస్తూ కోత పెట్టెయ్యడం, కొన్నిటీమ్స్ లేపెయ్యడం చూస్తుంటే.. జబర్దస్త్ లో భారీ మార్పులు దేనికి సంకేతాలో అర్ధం కావడం లేదు.

Huge changes in Jabardasth:

Jabardasth show commences with few changes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ