చాలామంది సెలబ్రిటీస్ తిరుమల తిరుపతికి వెళ్లి కాలినడకన మెట్లెక్కి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం. సమంత అయితే తన సినిమాల విడుదలకు ముందు వెంకన్న దర్శనానికి వెళ్లి.. కాలినడకన మెట్లెక్కి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా నితిన్ కూడా తన భార్య షాలిని పుట్టిన రోజు ముందు శ్రీ వారి మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఉప్పెన సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టి.. సక్సెస్సె లెబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న ఉప్పెన టీం కాలినడకన శ్రీవారి మెట్లెక్కి అక్కడ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఉప్పెన సినిమా విడుదలకు ముందు నుండే విపరీతమైన సన్సేషన్ క్రియేట్ చేసి.. విడుదలయ్యాక సూపర్ హిట్ కొట్టడంతో.. మూవీ యూనిట్ మొత్తం సక్సెస్ టూర్ నిర్వహించింది.
మైత్రి నిర్మాతలు, దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి లు ప్రముఖ థియేటర్స్ ని విజిట్ చేస్తూ.. ఉప్పెన పబ్లిసిటీ చేసారు. అలా తూర్పు గోదావరి పర్యటనలో ఉన్న ఉప్పెన టీం అక్కడ అన్నవరం సత్యన్నారాయణుడికి ప్రత్యేక పూజ కూడా నిర్వహించారు. ఇక రీసెంట్ గా ఉప్పెన పబ్లిసిటీ లో భాగంగా ఉప్పెన టీం.. తిరుపతిలోని థియేటర్స్ ని సందర్శించింది. అలాగే టీం లోని బుచ్చి బాబు, మైత్రి నిర్మాతలు, హీరో వైష్ణవ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి లు కాలినడకన శ్రీ వారి మెట్లెక్కి వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.