రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన అప్ డేట్ ఇచ్చింది జనవరి నెలాఖరున. ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదీ తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలగలిపిన పోస్టర్ ని వదిలారు. గత ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజున ఆయన ఫాన్స్ కి అదిరిపోయే ఆర్ ఆర్ ఆర్ వీడియో ఇచ్చిన రాజమౌళి ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కరోనా క్రైసిస్ అడ్డం పడింది. ఇక కరోనా వలన వాయిదా పడిన షూటింగ్ మళ్ళీ అక్టోబర్ లో మొదలు కావడంతో.. వెంటనే వారం తిరక్కుండా ఎన్టీఆర్ కొమరం భీం స్పెషల్ వీడియో ని రిలీజ్ చేసింది ఆర్ ఆర్ ఆర్ టీం. అయితే మహాశివరాత్రికి ఆర్.ఆర్.ఆర్ నుండి స్పెషల్ అప్ డేట్ రాబోతుంది అనే టాక్ ఉన్నప్పటికీ.. రాజమౌళి మాత్రం ఈసారి ఆర్. ఆర్. ఆర్ అప్ డేట్ కోసం డేట్ లాక్ చేసేసారట.
అది రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ గా ఆర్.ఆర్.ఆర్ నుండి స్పెషల్ టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అంటే మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే రోజున మెగా ఫాన్స్ కి పుట్టిన రోజు సంబరాలతో పాటుగా ఆర్.ఆర్.ఆర్ సంబరాలు కూడా జరుపుకోవడానికి రెడీ అవ్వాల్సిందే. మరి ఆర్. ఆర్. ఆర్ ప్రమోషన్స్ కూడా మార్చి ఎండ్ నుండే కొద్ది కొద్ది గా మొదలు పెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో వీఎఫెక్స్, అలాగే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్టార్ట్ చేసిన ఆర్. ఆర్. ఆర్ టీం.. రామ్ చరణ్ బర్త్ డే కి ఆర్. ఆర్. ఆర్ నుండి స్పెషల్ ట్రీట్ ఇచ్చి అభిమానులు రాజమౌళి ఖుషి చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.