Advertisementt

రాజు గారు సామాన్యుడు కాదు

Fri 26th Feb 2021 11:22 AM
dil raju,allari naresh,remake rights,naandhi  రాజు గారు సామాన్యుడు కాదు
Dil raju bags remake rights of Naandhi రాజు గారు సామాన్యుడు కాదు
Advertisement
Ads by CJ

దిల్ రాజు తెలివితేటలూ వేరయా అన్నట్టు దిల్ రాజు మెచ్చాడు అంటే దానికి విపరీతమైన క్రేజు, విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. ప్రస్తుతం దిల్ రాజు నుండి షాదీ ముబారక్ మూవీ మార్చ్ 5 న రాబోతుంది. మరోపక్క దిల్ రాజు కదుపుతున్న పావులు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. నిన్నగాక మొన్న భారీ ఎత్తున శంకర్ - రామ్ చరణ్ తో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ ప్రకటించి షాకిచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు చేసిన ఓ పనికి అందరూ షావుతున్నారు. అదేమిటంటే గత శుక్రవారం విడుదలైన నాంది సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమా పాజిటివ్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దానితో సైలెంట్ గా రంగంలోకి దిగిన దిల్ రాజు.. నాంది టీం ని అప్రిషియేట్ మీట్ అంటూ పెట్టి అందరిని సన్మానించాడు. మంచి సినిమాని నిలబెట్టే ఉద్దేశ్యంతో దిల్ రాజు ఇలా చేసాడనుకున్నారు.

కానీ అక్కడ విషయం ఏమిటి అంటే దిల్ రాజు నాంది రీమేక్ రైట్స్ కొనబట్టే ఇలాంటి థాంక్యూ మీట్స్ పెట్టాడట. నాంది తెలుగులో సూపర్ హిట్ అవడంతో ముందుగా మేల్కొన్న దిల్ రాజు నాంది రీమేక్ రైట్స్ కొనేసాడట. మరి ఈ మధ్యన దిల్ రాజుకి హిందీ మీద ఫోకస్ ఎక్కువవుతుంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు నాంది రైట్స్ పట్టుకుని అక్కడా ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి బయలుదేరబోతున్నాడు. మరి ఇప్పటికే బాలీవుడ్ పరిచయాలతో దిల్ రాజు బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి రెడీ అవుతున్నాడు. జెర్సీ షాహిద్ కపూర్ తో హిట్ కొట్టాక నాందీని మొదలు పెడతాడో.. లేదంటే ముందే స్టార్ట్ చేస్తాడో చూద్దాం.

Dil raju bags remake rights of Naandhi:

Dil Raju acquires the remake rights of Naandhi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ