Advertisementt

విశాల్ పెళ్లిపై స్పెషల్ న్యూస్

Thu 25th Feb 2021 09:56 PM
vishal,chakra movie,vishal wedding news,vishal marriage,vishal wedding plans  విశాల్ పెళ్లిపై స్పెషల్ న్యూస్
Special news on Vishal's wedding విశాల్ పెళ్లిపై స్పెషల్ న్యూస్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి పై మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ పెళ్లి విషయంలో విశాల్ కొన్నాళ్ళు హ్యాపీ గానే ఉన్నాడు. కానీ వరలక్ష్మి కి విశాల్ కి బ్రేకప్ అయ్యాక కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ విశాల్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో విశాల్ - అనీషా రెడ్డిల ఎంగేజ్మెంట్ అందరికి షాకిచ్చింది. విశాల్ హైదరాబాద్ అమ్మాయి అనీషా రెడ్డితో లవ్ లో ఉండి సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు విశాల్. అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది కదా విశాల్ పెళ్లి వార్త కోసం వెయిట్ చేస్తుంటే.. మళ్ళీ అనిషా కి విశాల్ కి బ్రేకప్ అవడం అనీషా రెడ్డి వేరొకరితో పెళ్లి పీటలెక్కడం జరిగిపోయింది.

అయితే రీసెంట్ గా చక్ర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ కి చక్ర మూవీ సో సో రిజల్ట్ ఇచ్చింది. విశాల్ గత సినిమా అభిమన్యుడిలా ఉంది అంటూ ప్రేక్షక దేవుళ్లతో పాటుగా.. విమర్శుకులూ అన్నారు. అయితే ప్రస్తుతం డిటెక్టీవ్2 తో దర్శకుడిగా మారిన విశాల్..  నేను హీరో అవుదామనుకుని.. హీరో అవ్వలేదు.. అనుకోకుండా అలా జరిగిపోయింది. అలాగే నిర్మాతగానూ, దర్శకుడిగా అనుకోకుండా మారినట్టుగానే నా పెళ్ళి ఈ ఏడాదిలోనే ఉండొచ్చు అని, ఈ ఏడాదిలో నా పెళ్ళికి సంబందించిన వార్త వింటారంటూ తన పెళ్లి పై వస్తున్న వార్తలకు విశాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

Special news on Vishal's wedding:

Vishal Opens up on his wedding plans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ