రేపు శుక్రవారం నితిన్ చెక్ మూవీ రిలీజ్ కాబోతుంది. గత ఏడాది ఇదే టైం కి భీష్మ హిట్ ని ఎంజాయ్ చేసిన నితిన్ ఇప్పుడు ఈ టైం కి చెక్ రిజల్ట్ టెంక్షన్ లో ఉన్నాడు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మీద మంచి బజ్ ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ అందాలు, రకుల్ పెరఫార్మెన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే చెక్ ప్రమోషన్స్ పరంగాను అదరగొట్టేస్తుంది. మంచి బజ్ ఉన్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఊహించని ట్వీట్ పడితే ఆ యూనిట్ పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహకందని ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. అలానే ఉంది చెక్ టీం పరిస్థితి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చంద్ర శేఖర్ ఏలేటి సినిమాలకు నేను ఫ్యాన్ ని, ఆయన ఎంచుకునే కథలు, వాటిని చెప్పే తీరు అన్ని ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.. వాటికి నేనెప్పుడూ అభిమానినే. చెక్ మూవీ పోస్టర్స్ అన్నీ బావున్నాయి. హీరో నితిన్ అలాగే ఎంటైర్ టీం కి శుభాకాంక్షలు అని ట్వీట్ చెయ్యడంతో నితిన్ అండ్ దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి అలర్ట్ అయ్యిపోయారు. వెంటనే నితిన్ అయితే మీ ప్రేమకు, ప్రేమ పూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.. తారక్ బ్రదర్. మీకు మా చెక్ మూవీ తప్పక నచ్చుతోంది అంటూ ట్వీట్ చేసాడు. ఇక డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి కూడా నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని.. నీ సహకారం ఎప్పటికి మరిచిపోను అంటూ ట్వీట్ చేసారు. మరి సినిమా రిజల్ట్ పై ఎంతో ఉత్సుకతతో ఉన్న చెక్ టీం కి ఎన్టీఆర్ ట్వీట్ బూస్ట్ ఇచ్చినట్టే.