Advertisementt

కీలక ప్రకటన చెయ్యబోతున్న సూపర్ స్టార్

Thu 25th Feb 2021 02:50 PM
rajinikanth,tamilnadu,key announcement,movies,politics,february 26th  కీలక ప్రకటన చెయ్యబోతున్న సూపర్ స్టార్
The superstar who is going to make a key announcement కీలక ప్రకటన చెయ్యబోతున్న సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

అసలు సూపర్ స్టార్ రాజకీయాల్లో వస్తారా? రారా?.. అనేది అతి పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అనుకునేలోపు ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. కుటుంబ వత్తిళ్ళకి తలొగ్గి రాజకీయాలకు దూరమైన విషయం అందరికి తెలిసిందే. గత డిసెంబర్ లోనే రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రకటించి.. అంతలోనే అనారోగ్యం బారిన పడిన రజినీకాంత్.. పార్టీ ప్రకటించక ముందే.. తానూ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాలేను.. నా కుటుంబం నన్ను నా ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి వెళ్లోద్దని అంటుంది అందుకే నేను రాజకీయాల్లోకి రాలేను అంటూ ప్రకటించారు. కానీ సూపర్ స్టార్ అభిమానులు ఊరుకుంటారా? ధర్నాలు, ఆందోళనలు చేస్తూ సూపర్ స్టార్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మధ్యలో సూపర్ రజినీకాంత్ సినిమాలకు కూడా ఎండ్ కార్డు వెయ్యబోతున్నారనే టాక్ నడిచింది.

అయితే మళ్ళీ తాజాగా సూపర్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన రేపు ఉండబోతుంది అంటున్నారు. రేపు సూపర్ స్టార్ రజినీకాంత్ - రమాలత 40 వ వార్షికోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. అదే వేడుకలలో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు సంబందించిన కీలక ప్రకటన చెయ్యబోతున్నట్టుగా మీడియాలో న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. ఆయన 40 వ పెళ్లి రోజు సందర్భంగా రాజకీయాలపై రజినీకాంత్ కీలక ప్రకటన చేస్తారని, ఆయన అభిమానుల ఒత్తిళ్లకు రజిని తలొగ్గుతున్నారనే  టాక్ మొదలయ్యింది. మరి నిజంగా రేపు రజినీ చేసే ప్రకటన ఏమై ఉంటుంది అబ్బా అంటూ ఇప్పటినుండే అందరూ హాట్ హాట్ చర్చలకు తెర లేపారు.

The superstar who is going to make a key announcement:

Rajinikanth to make a key announcement on February 26th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ