Advertisementt

వావ్.. 24 క్రాఫ్ట్ లు - 64 రోజులు

Wed 24th Feb 2021 09:07 PM
sai dharam tej,aishwarya rajesh,wrap up,deva katta,republic movie,24 crafts,64 days  వావ్.. 24 క్రాఫ్ట్ లు - 64 రోజులు
Wow, 24 Crafts - 64 days వావ్.. 24 క్రాఫ్ట్ లు - 64 రోజులు
Advertisement
Ads by CJ

సినిమా అనేదే 24 క్రాఫ్ట్ ల సమాహారం. సరైన రీతిలో ఆ 24 క్రాఫ్ట్ లని సమీకరించుకుంటే ఎంత త్వరగా సినిమాని పూర్తి చెయ్యొచ్చో అనే దానికి ఉదాహరణగా నిలిచింది దర్శకుడు దేవా కట్టా తీస్తున్న రిపబ్లిక్. కరోనా టైం లో అందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ.. మన సినిమా వాళ్ళు మాత్రం ఆ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. లాక్ డౌన్ టైం లో కంప్లీట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న దేవా కట్టా.. పక్కా ప్లానింగ్ తో సెట్స్ మీదకి వెళ్లి.. 24 క్రాఫ్ట్ లని సరిగ్గా నడిపించుకుంటూ.. 64 రోజుల్లో ఈ రిపబ్లిక్ సినిమాని పూర్తి చేసేసాడు.

ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటిస్తూ ట్వీట్ చెయ్యడం విశేషం. ఈ 64 రోజుల్లోనూ తమ యూనిట్ లో ఎవరికీ కరోనా సోకనందుకు సంతోషాన్ని వ్యక్తం చెయ్యడమే కాకుండా సినిమా బాగా వచ్చింది అనే నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నాడు దేవా కట్టా. సాయి ధరమ్ తేజ్ కాస్త డిఫ్రెంట్ కేరెక్టర్ లో కనిపించబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు లవర్ బాయ్ లా డాన్స్ లతో ఆదరగొట్టేసిన సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ సినిమాలో విభిన్నంగా కాస్త బరువైన పాత్రనే పోషిస్తున్నాడు. సీరియస్ నెస్ నిండిన పాత్రలో కనిపించబోతున్న సాయి ధరమ్ కి జోడిగా పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తుంది. 

Wow, 24 Crafts - 64 days:

Sai Dharam Tej and Aishwarya Rajesh wrap up shoot for Deva Katta Republic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ