Advertisementt

నిన్న విలేజ్ సెటప్ - నేడు రెట్రో గెటప్

Wed 24th Feb 2021 05:49 PM
shyam singha roy first look,nani birthday special,tuck jagadish  నిన్న విలేజ్ సెటప్ - నేడు రెట్రో గెటప్
Nani Shyam Singha Roy First Look నిన్న విలేజ్ సెటప్ - నేడు రెట్రో గెటప్
Advertisement
Ads by CJ

నాని పుట్టిన రోజు సందర్భంగా నాని నటిస్తున్న సినిమాల నుండి టీజర్స్, పోస్టర్స్ అంటూ దర్శకనిర్మాతలు హడావిడి చేస్తున్నారు. నిన్న నాని పుట్టిన రోజు కి ముందుగానే విషెస్ చెబుతూ టాక్ జగదీశ్ టీజర్ రిలీజ్ చేసారు. మరి ఆ టీజర్ లో నాని క్లాస్ గా, స్టైలిష్ గా, పెళ్లి కొడుకుగా, ఫ్యామిలీ హీరోలా కనిపిస్తూ.. మంచి విలేజ్ సెటప్ తో వచ్చిన నాని నేడు నాని పుట్టిన రోజునాడు నానికి బెస్ట్ విషెస్ అంటూ  శ్యామ్ ‌సింగ రాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. రాహుల్ సంకీర్తన్ డైరెక్షన్ లో నాని నటిస్తున్న శ్యామ్ ‌సింగ రాయ్ ఫస్ట్ లుక్ లో నాని ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని గెట‌ప్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు.

ఒక టాలెంటెడ్ యాక్ట‌ర్‌, ఇంకో స‌మ‌ర్థుడైన డైరెక్ట‌ర్ క‌లిస్తే, ఒక మాగ్న‌మ్ ఓప‌స్ లాంటి సినిమా వ‌స్తుందంటారు. ఇప్పుడు.. నేచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న శ్యామ్ ‌సింగ రాయ్ అలాంటి అద్వితీయ చిత్రంగా రూపొందుతోంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలోనూ క‌లుగుతోంది. ఒక విల‌క్ష‌ణ క‌థ‌తో తీస్తున్న ఈ మూవీలో ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని గెట‌ప్‌లో నాని క‌నిపించ‌బోతున్నారు.

సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ లాంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ మూవీని వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 24 నాని బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని చిత్ర బృందం శ్యామ్ ‌సింగ రాయ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ పోస్ట‌ర్‌లో ఒక బెంగాలీ యువ‌కుని గెట‌ప్‌లో నాని స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆయ‌న మీస‌క‌ట్టు, హెయిర్ స్టైల్ విల‌క్ష‌ణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రెస్‌, ప‌క్క‌నే రిక్షా బండిని చూస్తుంటే ఈ మూవీ ఒక పీరియ‌డ్ డ్రామా అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మేమంటే నానిని వెన‌క నుంచి ఒక యువ‌తి గ‌ట్టిగా కౌగ‌లించుకుంది కానీ, ఆమె ముఖం అస‌లు క‌నిపించ‌డం లేదు. ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రు ఆయ‌న‌ను కౌగ‌లించుకున్నార‌నే విష‌యాన్ని మ‌న ఊహ‌ల‌కి వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ పోస్ట‌ర్ ప్ర‌కారం శ్యామ్ ‌సింగ రాయ్ ఒక విల‌క్ష‌ణ‌ ల‌వ్ స్టోరీ అనే విష‌యాన్ని ఊహించ‌వ‌చ్చు.

అపూర్వ‌మైన క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాని యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు ఒక స్పెష‌ల్ ఫిల్మ్‌గా న‌మ్మి వ‌ర్క్ చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లోనే ఆ విష‌యం సినిమాకు ప‌నిచేస్తున్న వారంద‌రికీ అర్థ‌మైపోయింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌క‌తాలో జ‌రుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు స‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. అక్క‌డ ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తీస్తున్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Nani Shyam Singha Roy First Look:

Shyam Singha Roy 1st Look: Amazing

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ