సరిగ్గా 2020 మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మగువ మగువ సాంగ్ బయటికొచ్చింది వకీల్ సాబ్ సినిమా నుండి. మగువ మగువ సాంగ్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. యూట్యూబ్ లో ఆ సాంగ్ కి మంచి లైక్స్, వ్యూస్ తెచ్చుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ నుండి కొన్ని స్టిల్స్, పోస్టర్స్ బయటికి వచ్చాయి. అలాగే సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ కూడా బయటికి వచ్చింది. కానీ మరో సాంగ్ బయటికి రాలేదు. విశేషం ఏమిటి అంటే సరిగ్గా సంవత్సరానికి మళ్ళీ అదే డేట్ కి అంటే మార్చి 8 మహిళా దినోత్సవం రోజున మరో సాంగ్ ని లాంచ్ చెయ్యబోతున్నారు వకీల్ సాబ్ టీం. వకీల్ సాబ్ నుండి మరో సింగిల్ రాబోతుంది.
వకీల్ సాబ్ సినిమాపై మంచి బజ్ ఉంది. అసలు వకీల్ సాబ్ పై ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్ కావడంతో ఆ సినిమాపై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ విపరీతమైన బజ్ వుంది. పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. దానితో రోజు రోజుకి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై అంచనాలు, ఆసక్తి పెరిగిపోతున్నాయి. మరి మగువా మగువా సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వకీల్ సాబ్ మూవీ నుండి రాబోతున్న సెకండ్ సాంగ్ ఇంకెంత బావుంటుందో అనే క్యూరియాసిటిలో కూడా ప్రేక్షకులు ఉన్నారు.