Advertisementt

బిగ్ బాస్ కి వెళితే అంత క్రేజ్ వచ్చేస్తుందా?

Wed 24th Feb 2021 11:19 AM
big boss,ariyana,demands,star ma  బిగ్ బాస్ కి వెళితే అంత క్రేజ్ వచ్చేస్తుందా?
Will there be such a craze if I go to Bigg Boss? బిగ్ బాస్ కి వెళితే అంత క్రేజ్ వచ్చేస్తుందా?
Advertisement
Ads by CJ

ఇంతకుముందు మూడు బిగ్ బాస్ సీజన్స్ కంటెస్టెంట్స్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ దూకుడు మాములుగా లేదు. సీజన్ 4 వీక్ అన్నప్పటికీ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున చిరు వరాల జల్లుతో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి బాగానే క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ముగిసాక సోహెల్ అనేక సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళుతుంటే.. అఖిల్ కొత్త మూవీ మొదలు పెట్టాడు. బిగ్ బాస్ క్రేజ్ తో మోనాల్ తో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు. విన్నర్ అభిజిత్ ఇంకా లీడ్ లోకి రాలేదు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక అవినాష్, అరియనాలతో స్టార్ మా క్యాష్ చేసుకుందామని.. ఏవేవో గేమ్ షోస్ ప్లాన్ చేసి ఏదేదో కామెడీ చేస్తుంది.

ఆ మాత్రం దానికే క్రేజ్ వచ్చేసింది అంటూ పారితోషకాలు పెంచేస్తే.. ఇచ్చేస్తారా? మరి అరియనా రోజుకి లక్ష డిమాండ్ అంటూ ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ లో అరుపులు కేకలతో, గ్లామర్ షో అంటూ బాగా హైలెట్ అయిన అరియనా కి బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తున్నాయ్, రాజ్ తరుణ్ మూవీలో చేస్తుంది అని అంటున్నారు. తాజాగా అరియనాని ఓ మూవీ యూనిట్ రెండు రోజుల డేట్స్ కోసం సంప్రదించగా 2 లక్షలు డిమాండ్ చేసిందట. కానీ ఆ యూనిట్ అరియనా కాళ్ళ వేళ్ళ పడి 50 వేలకి ఒపించారట. మరి బిగ్ బాస్ లో బాగా ఇచ్చారు కదా అని, బయట కూడా అదే రేంజ్ పారితోషకాలు డిమాండ్ చేస్తే .. వాళ్ళని పక్కన పెట్టడం ఎంతసేపు. అది గమనిస్తే కెరీర్ బావుంటుంది.

Will there be such a craze if I go to Bigg Boss?:

Will there be such a craze if I go to Bigg Boss?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ