Advertisementt

నటసింహం బాలయ్యతో క్రాక్ డైరెక్టర్

Tue 23rd Feb 2021 10:22 PM
natasimham,nandamuri balakrishna,crack director,gopichand malineni  నటసింహం బాలయ్యతో క్రాక్ డైరెక్టర్
Natasimham with Crack Director నటసింహం బాలయ్యతో క్రాక్ డైరెక్టర్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ BB3 షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆయన నెక్స్ట్ మూవీ క్రాక్ డైరెక్టర్ తో ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. క్రాక్ సినిమా సంక్రాంతి కి వచ్చి మాస్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ కి నందమూరి కాంపౌండ్ నుండి, మెగా కాంపౌండ్ నుండి పిలుపొచ్చినా. ముందుగా గోపీచంద్ మాత్రం బాలయ్య తో కమిట్ అయ్యాడు. బాలాకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా గోపీచంద్.. బాలయ్య సినిమాని తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. 

ఇక బాలకృష్ణ కూడా బోయపాటి BB3 షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. BB3 సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఫిల్మే. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య మరో మాస్ ఎంటర్ టైనర్ నే చెయ్యబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమా స్క్రిప్ట్ మీద గోపీచంద్ మలినేని వర్క్ చేస్తున్నాడు. మరి మాస్ డైరెక్టర్ - మాస్ హీరో కలిస్తే మాస్ బొమ్మ ఖాయం. ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ ని కలిసిన గోపీచంద్ మలినేని బాలయ్య తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ పిక్ చూసాక నటసింహం బాలయ్య తో మాస్ డైరెక్టర్ గోపీచంద్ అంటూ ఆ పిక్ కింద బాలయ్య అభిమానులు హ్యాపీగా కామెంట్స్ వేసుకుంటున్నారు. 

Natasimham with Crack Director:

Natasimham Nandamuri Balakrishna with Crack Director Gopichand Malineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ