Advertisementt

అక్కినేని కాంపౌండ్ లోకి బుచ్చిబాబు

Tue 23rd Feb 2021 09:47 PM
uppena director,buchi babu,tarak,akkineni compound,akhil,naga chaitanya,two films  అక్కినేని కాంపౌండ్ లోకి బుచ్చిబాబు
Buchi babu into the Akkineni compound అక్కినేని కాంపౌండ్ లోకి బుచ్చిబాబు
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకున్న డెబ్యూ డైరెక్టర్ బుచ్చి బాబు సాన. మొదటి సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం బుచ్చి బాబు రేంజ్ ని పెంచింది. బడా నిర్మాతలతో ఫస్ట్ సినిమా అంటే.. సినిమాకి బడ్జెట్, అలాగే ప్రమోషన్స్ విషయం, సినిమా మీద అంచనాలు ఎలా ఉంటాయో ఉప్పెన సినిమా చూసాక అర్ధమయ్యింది. అయితే ఉప్పెన సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ గా దర్శకుడిగా మారిన బుచ్చి బాబు వెంట యంగ్ హీరోలు పడుతున్నారనే టాక్ నడుస్తుంది. అసలు తారక్ అయితే బుచ్చి బాబుకి ఓ ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరో పక్క బుచ్చి బాబు అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది.

ఒకరు బుచ్చి బాబు సాన అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నాడు అంటే.. మరొకరు నాగ చైతన్య తో బుచ్చి బాబు సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. ఇంతకీ బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా కథని ఏ హీరోకి వినిపించకపోయినా.. బుచ్చి బాబు ని లాక్ చేసేందుకు యంగ్ హీరోలు రేడి అవుతున్నారనేది నిజమే అయినా.. ప్రస్తుతం బుచ్చి బాబు నెక్స్ట్ మాత్రం ఫిక్స్ అవలేదు. ప్రస్తుతం ఉప్పెన సక్సెస్ టూర్ అంటూ థియేటర్స్ విజిట్ కి వెళ్లిన బుచ్చి బాబు సానా ఉప్పెన సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే బుచ్చి బాబు ని రెండు సినిమాలకు మైత్రి మూవీస్ వారు లాక్ చేశారనే టాక్ ఉండగా ఇప్పుడు అందరి చూపు బుచ్చి బాబు నెక్స్ట్ మీదే ఉంది. 

Buchi babu into the Akkineni compound:

Uppena director Buchi Babu two films deal?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ