Advertisementt

రకుల్ షూటింగ్ లో యూనిట్ పై రాళ్ల దాడి

Tue 23rd Feb 2021 08:58 PM
villagers,rakul preet sing,attack movie,stones attack  రకుల్ షూటింగ్ లో యూనిట్ పై రాళ్ల దాడి
Stones attack On Rakul Preet Movie Attack sets రకుల్ షూటింగ్ లో యూనిట్ పై రాళ్ల దాడి
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించిన చెక్ మూవీ రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ఇక రకుల్ తెలుగు సినిమాల సంగతి ఎలా ఉన్నా బాలీవుడ్ లో మాత్రం బంపర్ రేంజ్ లో సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ లక్ష్యరాజ్ దర్శకత్వంలో జాన్ అబ్రహం అటాక్ సినిమాలోనూ, అమితాబచ్చన్ - అక్షయ కుమార్ ల మేడే సినిమాలతో పాటుగా మరో బాలీవుడ్ మూవీ ఒప్పుకుంది. అయితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ - జాన్ అబ్రహం జంటగా నటిస్తున్న అటాక్ సినిమా షూటింగ్ స్పాట్ లో మూవీ యూనిట్ పై రాళ్ళ దాడి జరగడం, యూనిట్ సభ్యులకి కొందరికి గాయాలు కూడా అయ్యాయి. 

ఇంతకీ అటాక్ యూనిట్ పై రాళ్లతో అటాక్ చేసింది ఎవరు అంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ధనిపూర్‌లో అటాక్ మూవీ కి సంబందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ యాక్షన్ పార్ట్ లో భాగంగా డమ్మీ బాంబు పేల్చడంలో ఆ శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. అక్కడేదో షూటింగ్ జరుగుతుంది అని.. షూటింగ్ స్పాట్ కి భారీగా చేరుకోవడంతో.. షూటింగ్ కి అంతరాయం కలిగింది. దానితో గ్రామస్తులని అడ్డుకునేందుకు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాస్త గట్టిగా ప్రయత్నించడంతో గ్రామస్తులంతా తమ అభిమాన నటులను చూడనివ్వరా అంటూ సెక్యూరిటీ సిబ్బంది మీద చిత్ర బృందం పై రాళ్ల దాడి చెయ్యడంతో యూనిట్ సభ్యులకి కొంతమంది కి గాయాలయ్యాయి. పోలీస్ ల రంగ ప్రవేశంతో అక్కడి గొడవ సద్దుమణిగింది. అయితే హీరో హీరోయిన్ కి మాత్రం ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో చిత్ర బృందం కూడా ఊపిరి పీల్చుకుంది. 

Stones attack On Rakul Preet Movie Attack sets:

As villagers came to watch the actors on shooting they were not allowed by the security guards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ