హాట్ యాంకర్ అనసూయ అందాలు కేవలం జబర్దస్త్ లోనే కాదు వెండితెర మీద వెలిగిపోతున్నాయి. అటు ఐటెం సాంగ్స్, ఇటు కీ రోల్స్ అబ్బో అనసూయ వెండితెర వెలుగులు మాములుగా లేవు. రవితేజ ఖిలాడీ సినిమాలో కీలక పాత్ర అంటే రవితేజతో ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న అనసూయ రీసెంట్ మూవీ థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్దమవుతుంది. ఇక అనసూయ గతంలో సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవీలో సూయా సూయ అనసూయ అనే సాంగ్ లో క్లాసీ స్టెప్స్ వేస్తే.. ఇప్పుడు కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో మాస్ ఐటెం స్టెప్స్ తో అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు అంటూ అదరగొట్టబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఐటెం సాంగ్ స్టిల్స్ లో అనసూయ లుక్ మాస్ కాదు ఊర మాస్ లా కనిపిస్తుంది.
అయితే అనసూయ ఇలా ఐటెం సాంగ్స్ చేస్తుంది కదా అని మరికొంతమంది ఈ హాట్ యాంకర్ అనసూయని సంప్రదించగా.. నేను ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను. చావు కబురు చల్లగా సినిమానే లాస్ట్ ఐటెం సాంగ్. అది కూడా నా ఫ్రెండ్ జానీ మాస్టర్ అడిగాడని చేస్తున్నా.. అంటూ చావుకబురుని చల్లగా చెప్పేసరికి అనసూయ అభిమానులు హార్ట్ అవుతున్నారు. అనసూయ గ్లామరస్ గా ఊర మాస్ స్టెప్స్ తో స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూడాలనుకుంటున్న యూత్ కి అనసూయ సమాధానం షాకిచ్చింది. మరి జానీ మాస్టర్ తో గతంలోనూ అనసూయ స్పెషల్ షోస్ లో స్టేజ్ మీద ఆదిరిపోయే స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్ ఆధ్వర్యంలో చావుకబురు చల్లగా లో మాస్ స్టెప్స్ తో ఇరగదియ్యబోతుంది కానీ.. ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను అనడమే ఫాన్స్ ని కలవరపెడుతుంది.