బాలకృష్ణ -బోయపాటి BB3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిన్నటివరకు రామోజీ ఫిలిం సిటీలో BB3 షూటింగ్ చిత్రీకరణ చేపట్టిన బోయపాటి రీసెంట్ గా లొకేషన్ మార్చాడు. బాలకృష్ణ ఉత్సాహంగా BB3 షూటింగ్ కంప్లీట్ చేసి గోపీచంద్ మలినేని తో చెయ్యబోయే మాస్ ఎంటర్టైనర్ కోసం రెడీ కావాలని అనుకుంటున్నారు. BB3 ఎలాగూ ఏప్రిల్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఏప్రిల్ లోనే గోపీచంద్ మలినేని మూవీ ని మొదలు పెట్టె ఆలోచనలో బాలయ్య ఉన్నారు. మరోపక్క హిందూపూర్ ఎమ్యెల్యేగా ఉన్న బాలయ్య రాజకీయాల్లోనూ చురుగ్గానే పాల్గొంటున్నారు.
ఇక బోయపాటి BB3 చిత్రీకరణ కోసం వికారాబాద్ లోని కొటాలగూడెం లొకేషన్ ఎంచుకుని షూటింగ్ కి సమాయత్తమవుతున్న తరుణంలో కొటాలగూడెం గ్రామస్తులు బాలయ్య - బోయపాటి BB3 షూటింగ్ ని అడ్డుకున్నారు. కారణం కొటాలగూడెం లోని పంట పొలాల్లో షూటింగ్ చేస్తే కొటాలగూడెం కు చెందిన పంటపొలాలు దెబ్బతింటాయని.. అందువల్ల తమ గ్రామంలో కానీ, పంటపొలాల్లో కానీ షూటింగ్ చేయవద్దు అంటూ స్థానికులు అడ్డుకున్నారు. దానితో బోయపాటి BB3 కోసం మరో లొకేషన్ వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. ఇక బాలయ్య - బోయపాటి BB3 కి పవర్ ఫుల్ టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ప్రచారంలో ఉంది.