Advertisementt

యూట్యూబర్ కి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో

Mon 22nd Feb 2021 09:03 PM
vishwak sen,akshara movie song,nanditha swetha,youtube channels  యూట్యూబర్ కి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో
Young hero who gave a warning to youtuber యూట్యూబర్ కి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక కొంతమంది మంచి విషయాలే కాదు.. చెడు విషయాలను కూడా తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే బయట టైటిల్ ఒకటి పెట్టి లోపల మేటర్ మరొకటి పెడుతుంది. బయట టైటిల్ చూసి నిజమనుకుని లోపల వీడియో చూస్తే దానికి దీనికి సంబంధమే ఉండదు. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కి యంగ్ హీరో విశ్వక్ సేన్ వార్నింగ్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ రీసెంట్ గా నందిత శ్వేతా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన అక్షర మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. అయితే ఆ ఈవెంట్ లో నందిత శ్వేతా మాట్లాడిన వీడియోని.. అంటే విశ్వక్ సేన్ తమ మూవీ సాంగ్ విడుదల చెయ్యడానికి వచ్చినందుకు.. సంతోషంగా ఉంది అంటూ కృతఙ్ఞతలు తెలిపింది.  

కానీ ఆ యూట్యూబ్ ఛానల్.. నందిత వీడియో ని పోస్ట్ చేసి థంబ్‌నైల్ లో ఓ బోల్డ్ కామెంట్ పెట్టింది. అది చూసిన విశ్వక్ సేన్ ఆ యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయ్యాడు.

ఆ యూట్యూబ్ ఛానల్ గనక 24 గంటల్లో సారి చెబుతూ మరో వీడియో అప్ లోడ్ చెయ్యకపోతే నా షూటింగ్స్ అన్ని పక్కనబెట్టి నీ అడ్రెస్స్ కనుక్కుని ఇంటికొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఆ ఈవెంట్ లో ఆమె ఏం మాట్లాడింది. మీరు పెట్టిన థంబ్‌నైల్ ఏమిటి.. కొంచెం కూడా విలువలు లేవా.. ఇలా చేసేముందు, ఇలా రాసేముందు మీ ఇంట్లో అక్కా, చెల్లెలు గురించి ఆలోచిస్తే ఇలా పెట్టరు. ఆ ఛానెల్‌కి చెప్తున్నా 24 గంటల్లో సారీ చెబుతూ వీడియోను విడుద‌ల చేయండి.. లేదంటే అంటూ విశ్వక్ సేన్ తనదైన స్టయిల్లో ఆ యూట్యూబ్ ఛానల్ ని ఆడుకున్నాడు.

Young hero who gave a warning to youtuber:

Vishwak sen fir on Youtube channels

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ