ఈ కాలంలో ఒక సినిమాని దర్శకనిర్మాతలు ఎంత కష్టపడి తెరకెక్కించామన్నది మేటర్ కాదు.. ఆ సినిమాకి ఎంతగా పబ్లిసిటీ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళమన్నదే అసలు సిసలైన మేటర్. సినిమా సాంగ్స్ దగ్గరనుండి, టీజర్ వరకు, ట్రైలర్ దగ్గర నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఎంత గొప్పగా చేసాము.. ఆ సినిమా ఎంతగా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది అనేది ఇప్పుడు వస్తున్న సినిమాలకు ముఖ్యం. ఈ పబ్లిసిటీ అనేది ఎప్పటినుండో ఉన్నా.. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ లోకి ఆడియన్స్ ని రప్పించాలంటే హీరో - హీరోయిన్స్, దర్శకనిర్మాతలు ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి. అప్పుడే సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
గత ఏడాది కరోనా క్రైసిస్ వలన వాయిదా పడిన ఉప్పెన సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామంటూ మైత్రి మూవీస్ మేకర్స్ పట్టుబట్టుకుని కూర్చున్నారు. మధ్యలో ఓటిటీలు వెంట బడినా ఏ మాత్రం తగ్గలేదు. మెగా హీరో డెబ్యూ సినిమా అయినా.. మైత్రి మూవీస్ వారు ఉప్పెన సినిమాని పబ్లిసిటీ ని పీక్స్ లో నిర్వహించారు. మెగాస్టార్ చిరు దగ్గరనుండి మెగా ఫామిలీ మొత్తం వైష్ణవ్ ని సపోర్ట్ చేసింది. మరోపక్క సుకుమార్ తన శిష్యుడి కోసం ఉప్పెన సినిమాని భీభత్సంగా ప్రమోట్ చేసాడు. సినిమా విడుదలకు ముందే ఆ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ ఛేసింది. విపరీతమైన హైప్ తో విడులయిన ఉప్పెన సినిమాలో మేటర్ సో సో గా ఉన్నప్పటికీ.. సినిమాకొచ్చిన హైప్ ముందు అది ఎక్కడా కనబడలేదు. సరికదా కలెక్షన్స్ డౌన్ అవ్వలేదు.
ఉప్పెన సినిమా రిలీజ్ అయిన దగ్గరనుండి స్టిల్ ఇప్పటివరకు ఉప్పెన థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటే ఆ సినిమా పబ్లిసిటీనే కారణం. మైత్రి వారు చేసిన పబ్లిసిటీకి ప్రేక్షకులు పడిపోయారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరో-హీరోయిన్స్ థియేటర్స్ చుట్టూ తిరుగుతూ ఇంకా ఇంకా ప్రమోట్ చెయ్యడం వలనే గత వారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నాంది కలెక్షన్స్ ని కూడా ఉప్పెన కలెక్షన్స్ గండి కొడుతున్నాయి.