దర్శకుడు తేజ తన ఆస్థాన విద్వాంశుడు ఆర్పీ పట్నాయక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ రంగంలోకి దింపుతున్నాడు. కెమేరామ్యాన్ సమీర్ రెడ్డి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు ఇలా తన ఓల్డ్ టీం నే కంటిన్యూ చేస్తూ మళ్ళీ చిత్రం సినిమాకి కి సీక్వెల్‌గా చిత్రం 1.1 అంటూ మళ్ళీ వస్తున్నాడు. ఉదయ్ కిరణ్ - రీమా సేన్ జంటగా 1999 లో చిత్రం సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ.. మళ్ళీ 22 ఏళ్ళకి చిత్రం కి సీక్వెల్ చేస్తున్నాడు. అప్పట్లో చిత్రం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ ని బాగా కిర్రెక్కించిన సినిమా. ఇప్పుడు బాగా అప్ డేట్ అయిన యూత్ ని తేజ మళ్ళీ ఎలా అడాప్ట్ చేసుకుంటాడో.. ఎలాంటి హాట్ సబ్జెక్టు ని చూజ్ చేసుకుంటాడో.. వేచి చూద్దాం.
డైరెక్టర్ తేజ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించారు. అయితే, ఆయన దర్శకునిగా పరిచయమైన చిత్రం ఆయన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తేజ తీర్చిదిద్దిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఆ ఫిల్మ్‌తోటే దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సమకూర్చిన సంగీతం ఒక హైలైట్‌గా నిలవడమే కాకుండా, పాటలన్నీ ఒక సెన్సేషన్‌ను సృష్టించాయి.
నేడు తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంకు సీక్వెల్‌ను ప్రకటించారు. అంతా కొత్త తారలు నటించే ఆ మూవీకి చిత్రం 1.1 అనే టైటిల్ ఖరారు చేశారు. మ్యూజికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ సినిమా ద్వారా 45 మంది కొత్తవారిని తేజ పరిచయం చేస్తున్నారు.
చిత్రం 1.1తో తేజ, ఆర్పీ పట్నాయక్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ వస్తోంది. చిత్రం తరహాలోనే ఈ సీక్వెల్ సైతం మ్యూజికల్ హిట్టవడం ఖాయం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, శంకర్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
చిత్రం మూవీస్ బ్యానర్‌పై తేజ స్వయంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కు ఎస్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి. మార్చిలో చిత్రం 1.1 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ద బెస్ట్.. హ్యాపీ బర్త్ డే టు తేజ.