Advertisementt

పవన్ ఫైటింగ్ షురూ అయ్యింది

Mon 22nd Feb 2021 01:40 PM
pawan kalyanm krish movie,new schedule,shooting,krish film  పవన్ ఫైటింగ్ షురూ అయ్యింది
Pawan In Action Mode పవన్ ఫైటింగ్ షురూ అయ్యింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ షూటింగ్, ఏపీ పంచాయితీ ఎలక్షన్స్ నుండి బయటికి వచ్చి క్రిష్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఏపీ పంచాయితీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా ఖుషీగా ఉత్సాహంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 17 వ శతాబ్దపు కాలాన్ని ప్రతిబింబించే సెట్స్ లో క్రిష్ - పవన్ కళ్యాణ్ కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి ప్రారంభమైంది. యాక్షన్ సీక్వెన్స్ ని క్రిష్ షూట్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా జిమ్ లో వర్కౌట్స్ అవీ ఇవి చేసి బాగా ఫిట్ గా తయారైన పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్ లో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లో పవన్ తో తలపడబోతున్నాడు. 

పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ చార్మినార్, గండిపేట సెట్స్ ని ప్రత్యేకంగా రెడీ చేయించాడు. ప్రస్తుతం ఆ రెండు సెట్స్ లోనే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ స్పెషల్ క్వీన్ పాత్రలో మెరవబోతుంది. క్రిష్ - పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ గా హరిహర వీరమల్లు టైటిల్ వాడుకలో ఉంది. త్వరలోనే పవన్ - క్రిష్ టైటిల్ ప్రకటన ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా కొత్త షడ్యూల్ కోసం 10 రోజుల డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పది రోజుల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ అయ్యప్పమ్ కోషియం రీమేక్ సెట్స్ లోకి షిఫ్ట్ అవుతారు. 

Pawan In Action Mode:

Pawan Kalyan Shooting For Krish Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ