వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ చెక్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ లు చెక్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ మాత్రం చెక్ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. మరి రకుల్ కి చెక్ సినిమాలో పాత్ర నచ్చలేదా? నితిన్ తో డ్యూయెట్స్ కానీ తన పాత్రకి ప్రాధాన్యత కానీ లేదని ఫీలయ్యి చెక్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందా? అనే అనుమానం అందరిలోనూ మొదలయ్యింది. ఆఖరికి గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రకుల్ దర్శనం లేదు.
అందులోనూ నితిన్ కూడా ఈ మధ్యన రకుల్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అదేమిటంటే చెక్ సినిమాలో ఒక డ్యూయెట్ లేకుండా.. సీరియస్ పాత్రలో రకుల్ చెయ్యడం నాకు షాకింగ్ విషయం, ఒక కమర్షియల్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి సినిమా రకుల్ ఒప్పుకోవడం నాకు షాకింగ్ విషయం అనడంతో నిజంగానే రకుల్ ఫీలవుతుంది అని అనుకుంటున్నారు అంతా. అయితే రకుల్ పై వస్తున్న ఈవార్తలుకూ చెక్ పెడుతూ.. తానెందుకు చెక్ ప్రమోషన్స్ పాల్గొనలేకపోతుందో.. దానికి గల కారణాలకు కూల్ గా చెక్ పెట్టింది. రకుల్ ప్రీత్ తాను చెక్ ప్రమోషన్స్ అంటే చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోవడానికి గల కారణం తాను ముంబై షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదని.. సారి చెబుతూ చెక్ సినిమా 26 న రిలీజ్ అవుతుంది అందరూ చూడండి అంటూ సోషల్ మీడియాలో చెక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. నిజమే రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. కాబట్టే చెక్ ప్రమోషన్స్ కి రాలేకపోతుంది. ఇది నిజం.