Advertisementt

విజిల్స్ కొట్టిస్తున్న సీటిమార్ టీజ‌ర్‌

Mon 22nd Feb 2021 11:56 AM
seetimaar movie,gopichand,sampath nandi,seetimaar teaser,setimaar teaser,seetimaar teaser review  విజిల్స్ కొట్టిస్తున్న సీటిమార్ టీజ‌ర్‌
Gopichand Seetimaar Teaser Review విజిల్స్ కొట్టిస్తున్న సీటిమార్ టీజ‌ర్‌
Advertisement
Ads by CJ

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ  సీటీమార్‌. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజైన్ గోపిచంద్‌, త‌మ‌న్నా లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. గోపిచంద్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 22) ఉద‌యం 10:36 నిమిషాల‌కు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

యాక్ష‌న్ చెప్ప‌గానే క‌బ‌డ్డీ, క‌బ‌డ్డీ,క‌బ‌డ్డీ అంటూ మొద‌లైన ఒక నిమిషం12 సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేయ్ కార్తి‌..అంటూ రావు ర‌మేష్ పిల‌వ‌గానే  న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే ఒక‌టి మా ఇంట్లో వాళ్లు పిల‌వాలి లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి..ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్, అలాగే క‌బ‌డ్డీ మైదానంలో ఆడితే ఆట..బ‌య‌ట ఆడితే వేట అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ఉన్న ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. ఈ సంద‌ర్భంగా

మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ - మా రక్తం, చెమట చిందించి ఎంతో కష్టపడి తెరకెక్కించిన సీటీమార్ టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ టీజర్ మీకు చూపించాలని ఎంతగానో ఎదురుచూశాం. మీకు తప్పకుండా నచ్చుతుందని, మీ ప్రేమ‌, ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాన అన్నారు.

Click Here to: Seetimaas Teaser

Gopichand Seetimaar Teaser Review:

Gopichand Seetimaar Teaser release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ