Advertisementt

డైలాగ్ తో హిట్టిచ్చి డైరెక్ట్ గా హీరోతోనే..

Sun 21st Feb 2021 08:15 PM
mass maharaja,ravi teja,68th film,trinadha rao nakkina,people media factory,abhishek agarwal arts  డైలాగ్ తో హిట్టిచ్చి డైరెక్ట్ గా హీరోతోనే..
Ravi Teja - Trinadha rao Nakkina Movie fixed డైలాగ్ తో హిట్టిచ్చి డైరెక్ట్ గా హీరోతోనే..
Advertisement
Ads by CJ

రవితేజ - పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇడియట్ సినిమాలో చంటి గాడు లోకల్ అనే డైలాగ్ ఎంత పాపులరో అయ్యిందో తెలుసు కదా. ఆ సినిమాలో రవితేజ ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి.. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు.. నేను లోకల్, చంటిగాడు లోకల్ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది. అదే డైలాగ్ ని టైటిల్ గా పెట్టుకుని హీరో నాని తో సినిమా చేసి హిట్ కొట్టాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఒకప్పుడు రవితేజ డైలాగ్ ని వాడిన త్రినాధ్ రావు నక్కిన ఇప్పుడు డైరెక్ట్ గా రవితేజాతోనే సినిమా చెయ్యబోతున్నాడు. 

మాస్ మహారాజా రవితేజ, త్రినాథ‌రావు న‌క్కిన కాంభినేష‌న్‌లో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

మాస్‌మ‌హారాజ ర‌వితేజ హీరోగా సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు.  వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌వితేజ 68వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ర‌వితేజ త్వ‌ర‌లో ఖిలాడి సినిమాతో మ‌న ముందుకు రానున్నారు. ఖిలాడి  మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

Ravi Teja - Trinadha rao Nakkina Movie fixed:

Mass Maharaja Ravi Teja 68th Film With Trinadha Rao Nakkina Under People Media Factory and Abhishek Agarwal Arts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ