బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రావడంతో బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ అనేది బాగా కనెక్ట్ అయ్యింది. ఎన్టీఆర్ కోసమే బిగ్ బాస్ కి ఫాన్స్ అయిన బుల్లితెర ప్రేక్షకులు తర్వాత నాని, నాగార్జున హోస్టింగ్ లో వచ్చిన అన్ని సీజన్స్ ని ఆదరిస్తూ వచ్చారు. గత ఏడాది కోవిడ్ సీజన్ లో వచ్చినా బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఆదరించారు కానీ.. ఐపీఎల్ మ్యాచ్ లు బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్స్ కి గండికొట్టాయి. కేవలం వీకెండ్స్ లో మాత్రమే బిగ్ బాస్ రేటింగ్స్ బాగా వచ్చేవి. అందుకే ఈసారి ఆ తప్పు చేయమంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. అంటే ఈమధ్యన సోషల్ మీడియాలో బిగ్ బాస్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఇప్పటికే కొంతమంది పేర్లు ఫైనల్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
కానీ బిగ్ బాస్ సీజన్ 5 మాత్రం ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే త్వరలోనే అంటే ఏప్రిల్ లో ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. ఆ మ్యాచ్ లు ఏప్రిల్ అండ్ మే అంతా ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్ సీజన్ ఇప్పట్లో అంటే మ్యాచ్ ల టైం లో కాకుండా జూన్ నుండి మొదలు పెట్టె యోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉంది. ఈలోపు బిగ్ బాస్ లో పాల్గొనబోయే పార్టిసిపేట్స్ లిస్ట్, ఇంకా మిగతా విషయాలను బిగ్ బాస్ యాజమాన్యం చూసుకుంటుంది. ఐపీఎల్ మ్యాచ్ లకు ఎదురెళ్లి టీఆర్పీఎస్ కి గండికొట్టుకోవడం ఎందుకు.. ఆరామ్స్ గా బిగ్ బాస్ సీజన్ 5 ని జూన్ లేదా జులై నుండి మొదలు పెట్టి 100 రోజులు సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట.