Advertisementt

రష్మిక చెప్పేది నిజమేనా?

Sun 21st Feb 2021 01:06 PM
rashmika mandanna,pushpa pan india movie,hikes,remuneration,bollywood  రష్మిక చెప్పేది నిజమేనా?
Is what Rashmika says true రష్మిక చెప్పేది నిజమేనా?
Advertisement
Ads by CJ

లక్కీ గర్ల్ రష్మిక జోరు ని చూసి మిగతా హీరోయిన్స్ కుళ్ళుకుంటున్నారు. ఎందుకంటే గొప్పగా గ్లామర్ చెయ్యకపోయినా రష్మిక కొచ్చే అవకాశాలు చూసి. స్టార్ హీరోల అవకాశాలు చూసి, రష్మిక రేంజ్ చూసి. ప్రస్తుతం బన్నీ తో పాన్ ఇండియా మూవీ తో రేంజ్ పెంచుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి బయలుదేరింది. మూడు బాలీవుడ్ సినిమాలతో రష్మిక జోరు మాములుగా లేదు. తెలుగులో శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు తో పాటుగా తమిళ సినిమాలతో బిజీ అయిన రష్మిక రెమ్యునరేషన్ పై ఏదో ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడం దానికి రష్మిక ఇచ్చే ఘాటు ఆన్సర్స్ చూస్తున్నాము.

ప్రస్తుతం రష్మిక రేంజ్ 2 కోట్లు అని.. 2 కోట్లు ఇస్తేనే మూవీ చేస్తా అంటూ పారితోషకం విషయంలో రష్మిక పేచి పెడుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలా అన్నప్పుడు.. అవును డిమాండ్ ఉన్నప్పుడు తీసుకుంటే తప్పేముంది అన్న రష్మిక ఇప్పుడు మాత్రం అవునా నా పారితోషకం 2 కోట్లా. వినడానికి బావుంది.. అలా ఇస్తే నాకు బావుంటుంది. 2 కోట్లుగా అందుకోవడం తన కల మాత్రమే అని, నేను 2 కోట్ల పారితోషకం స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ సెటైర్ వేసింది. అంతేకాదు.. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి కాబట్టి కొత్త కథలు వినడం లేదని.. ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాకే నెక్స్ట్ మూవీ ఒప్పుకుంటా అంటూ బాంబ్ పేల్చింది.

Is what Rashmika says true:

Rashmika Mandanna hikes her remuneration?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ