బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లయ్యింది. మొదట తైమూర్ అలీ ఖాన్ కి జన్మనిచ్చిన బెబో ఇప్పుడు మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2012లో సైఫ్ అలీఖాన్ ని వివాహం చేసుకున్న కపూర్ కపూర్ సినిమాలకు దూరమవ్వలేదు. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్ తో బిజీగానే ఉండేది. బాలీవుడ్ కి సైజు జీరో పరిచయం చేసిన కరీనా కపూర్ 2016లో తైమూర్ అలీ ఖాన్ కి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టేవరకు ఏదో ఒక యాడ్ షూట్ అంటూ హెల్దీగానే తిరిగిన కరీనా కపూర్ రీసెంట్ గా రెండో బేబీ ప్రెగ్నెంట్ విషయంలోనూ అంతే.. యోగ, జిమ్ అంటూ కరీనా ఎప్పుడు హడావిడి చేస్తుండేది. ఇక శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం ఫిబ్రవరి 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు కపూర్స్ ట్వీట్ చేసారు.