ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా మలయాళంలో పెద్ద హిట్టు, పెద్ద సెన్సేషన్. మలయాళంలో భారీ హిట్ అయిన దృశ్యం సినిమాని తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్ లు రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఆల్మోస్ట్ అన్ని భాషల్లోకి దృశ్యం రీమేక్ అయ్యింది. అయితే మలయాళంలో దృశ్యం 2 ని సీక్వెల్ ని మోహన్ లాల్ ప్రకటించినప్పటినుండి ఇంతకుముందు దృశ్యం రీమేక్ చేసిన హీరోలెవరూ దానిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ సినిమా విడుదలయ్యాక చూసుకుందాంలే అని సైలెంట్ అయ్యారు. అది కూడా దృశ్యం 2 థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటిటి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసి మరీ మొదలు పెట్టారు. ఓటిటి లో ఈ సీక్వెల్ తెరకెక్కుతుంది అనగానే మళ్ళీ దాన్ని రీమేక్ ఏం చేస్తాంలే అనుకుంటూ ఆయా భాషల హీరోలెవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
అయితే సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే 19 వ తేదీ నైట్ నుండి అమెజాన్ ప్రైమ్ లో లైవ్ లోకొచ్చిన దృశ్యం 2 కి అమేజింగ్ రెస్పాన్స్ రావడం, ఒక్కసారిగా గతంలో దృశ్యం రీమేక్ చేసిన హీరోలందరితో కదలిక తీసుకొచ్చింది. మిగతా హీరోల సంగతి పక్కనబెడితే రీమేక్స్ విషయంలో ముందుండే వెంకటేష్, సురేష్ బాబు బ్రదర్స్ అయితే ఇమ్మీడియేట్ గా దృశ్యం 2 రీమేక్ రైట్స్ మాత్రమే కాకుండా దృశ్యం 2 ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ని కూడా పట్టుకొచ్చేసారు. నిజానికి దృశ్యం తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేసింది శ్రీప్రియ. కానీ దృశ్యం 2 తెలుగు రీమేక్ కోసం సురేష్ బాబు బ్రదర్స్ ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నే పట్టుకొచ్చేసారు. తెలుగులో వెంకటేష్ హీరోగా మీనానే హీరోయిన్ గా కంటిన్యూ అవుతారు. ఇక మిగతా నటులు కూడా ఎక్కువగా ఒరిజినల్ లోని నటులే ఉండే అవకాశాలున్నాయి. మార్చి1 న మొదలు కాబోయే ఈ దృశ్యం మూవీ శరవేగంగా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసే ఆలోచనలో దగ్గుబాటి బ్రదర్స్ ఉన్నారు. అయితే ఇలా ఓటీటీ లోకి వచ్చేసాక, జనం స్పందన చూసాక కాకుండా ముందే ఆ కథని, దర్శకుడిని నమ్మి సైమల్టేనియస్ గా చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. కానీ మన వెంకీ - సురేష్ బాబుల లెక్కే వేరు కదా.!!