Advertisementt

సుధీర్ ని దారుణంగా అవమానించిన రోజా

Sat 20th Feb 2021 10:47 AM
sudigali sudhir,roja,jabardasth,race gurram movie  సుధీర్ ని దారుణంగా అవమానించిన రోజా
Roja badly insulted Sudhir by Jabardasth stage సుధీర్ ని దారుణంగా అవమానించిన రోజా
Advertisement
Ads by CJ

జబర్దస్త్ టీం లీడర్ గానే కాదు.. వెండితెర మీద హీరోగానూ సుడిగాలి సుధీర్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఢీ స్టేజ్ మీద, జబర్దస్త్ స్టేజ్ మీద రష్మీ వ్యవహారంతో బాగా హైలెట్ అయిన సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ స్టేజ్ మీద ఘోర అవమానం జరిగింది. అది గత రాత్రి జబర్దస్త్ షో లో సుడిగాలి సుధీర్ భాస్కర్ స్కిట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. ఆ స్కిట్ లో హీరో కేరెక్టర్ చేసిన సుధీర్ కి అసిస్టెంట్ గా నరేష్ కనిపించాడు. ఆ స్కిట్ లో భాగంగా సుధీర్ ని నరేష్ మా హీరో గారి సినిమాల్లో ఎవరన్నా గెస్ట్ రోల్స్ చేస్తే బావుంటుంది. కానీ అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాలో మా సుధీర్ గారు గెస్ట్ రోల్ చేసారు అనగానే అది ఏ సినిమా అని భాస్కర్ అడుగుతాడు. దానికి రేసు గుర్రం అంటూ నరేష్ చెప్పడంతో ఫుల్ కామెడీ గా అందరూ నవ్వేస్తారు.

అవునా రేసు గుర్రం లో నువ్వు కూడా నటించవా సుధీర్ అని రష్మీ సుధీర్ ని అడగగానే రోజా కామెడీ గా నవ్వేస్తూ అవును రేసు గుర్రంలో సుధీర్ ఉన్నాడు. అది ఓ కారు తుడిచే అబ్బాయి కేరెక్టర్.. జస్ట్ అల కనిపించి ఇలా మాయమయ్యే కేరెక్టర్.. అదిగో సుధీర్ అని మా అబ్బాయికి చూపించే లోపే సుధీర్ మాయమైపోయాడు అంటూ నవ్వేయ్యడంతో సుధీర్ నవ్వు ఆపుకుంటూ స్టేజ్ మీద కనిపించాడు. అవునండి రేసు గుర్రంలో మా హీరో సుధీర్ మెరుపుతీగ లాంటి గెస్ట్ రోల్ చేసాడు అని నరేష్ అనగానే జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూశాయి. ఇదంతా జస్ట్ కామెడీ గానే చేసారు. రోజా సుధీర్ ని అలా కామెడీగా నవ్వుతూ ఆడేసుకుంది. మరి నిజంగా రోజా అలా అంటుంటే సుధీర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడంటే ఆ కామెడీ బిట్ ఎంతగా హైలెట్ అయ్యిందో అర్ధమవుతుందా.

Roja badly insulted Sudhir by Jabardasth stage:

Sudhir played a guest role in Race Gurram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ