Advertisementt

చెక్ ప్రమోషన్స్ ని అవాయిడ్ చేస్తుంది

Fri 19th Feb 2021 11:09 AM
rakul preet singh,check movie,promotions,nithin check movie,check movie review,bollywood movies  చెక్ ప్రమోషన్స్ ని అవాయిడ్ చేస్తుంది
Rakul avoiding check promotions చెక్ ప్రమోషన్స్ ని అవాయిడ్ చేస్తుంది
Advertisement
Ads by CJ

నితిన్ - చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన చెక్ మూవీ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ ప్రెస్ మీట్, స్పెషల్ ఇంటర్వూస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మంచి అంచనాలున్న చెక్ మూవీలో నితిన్ కి జోడిగా ప్రియా ప్రకాష్ వారియర్ అలాగే రకుల్ ప్రీత్ నటించారు. అయితే గ్లామర్ రోల్ లో ప్రియా ప్రకాష్ చెక్ లో నితిన్ తో రొమాన్స్ చేస్తుండగా.. రకుల్ ప్రీత్ ఈ మూవీలో లాయర్ పాత్ర చేసింది. అయితే ఇప్పుడు చెక్ ప్రమోషన్స్ లో ప్రియా ప్రకాష్ హుషారుగా పాల్గొంటుంటే.. రకుల్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కారణం బాలీవుడ్ లో బిజీ అనుకోవాలా? లేదంటే చెక్ సినిమాలో తన పాత్ర పరిధి గురించి ఫీలవుతుంది అనుకోవాలా?

ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని రకుల్ బాలీవుడ్ లో బాగా బిజీ. నాలుగు సినిమాలతో రకుల్ బాలీవుడ్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి ఉంది. అలాగే అక్కడి హీరోయిన్స్ కి పోటీగా రకుల్ ప్రీత్ జిమ్ వర్కౌట్స్ ఉంటున్నాయి. టాలీవుడ్ లో ఉన్నప్పుడు రకుల్ వర్కౌట్స్ విషయంలో బాగానే కష్ట పడింది. కానీ ఇక్కడ రకుల్ వర్కౌట్ వీడియోస్ షేర్ చేస్తేనే పాప జిమ్ కష్టాలు జనాలకు తెలిసేవి. కానీ బాలీవుడ్ లో అయితే రకుల్ జిమ్ కి వెళ్లిన దగ్గరనుండి.. ఆమె మళ్ళీ కారెక్కేవరకు కెమెరాలు ఆమె వెంటే ఉంటాయి. ఆటోమాటిక్ గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. అందుకే రకుల్ జిమ్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్, ఆమె జిమ్ కి వెళుతున్న ఫొటోస్ అన్ని మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి బాలీవుడ్ మూవీస్ కోసం గ్లామర్ పెంచుతున్న రకుల్ ఇలా టాలీవుడ్ మూవీస్ ని లెక్కచెయ్యకపోవడం ఏం బావుండలేదు. అసలే తెలుగులో అవకాశాలు లేని రకుల్.. ఇలా ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. 

Rakul avoiding check promotions:

Rakul Preet Singh on having a busy 2021 in Bollywood movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ