సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా బిగ్ బ్యానర్ మైత్రి మూవీస్ ద్వారా దర్శకుడిగా మారాడు. ఉప్పెన సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. మెగా హీరో వైష్ణవ తేజ్ తో తీసిన ఉప్పెన బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు వద్ద ఉప్పెనలా కాదు.. సునామీలా దూసుకుపోతుంది. బుచ్చి బాబుకి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఉప్పెన సినిమాకి వచ్చిన హైప్, మైత్రి మూవీస్ వారు చేసిన పబ్లిసిటీతో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కళకళలాడిపోతుంది. బ్రేక్ ఈవెన్ కాదు.. లాభాల వానలో నిర్మాతలు తడిచిపోతున్నారు.
మరి తమ బ్యానర్ కి అంతలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని ఊరికే వదిలేస్తారా.. అందుకే తమ బ్యానర్ లోనే బుచ్చి బాబు ని మైత్రి మూవీస్ వారు లాక్ చేశారనే టాక్ మొదలైంది. బుచ్చి బాబు సాన తో తమ బ్యానర్ లోనే యంగ్ హీరోస్ తో రెండు సినిమాలు ప్లాన్ చేస్తుందట మైత్రి మూవీ మేకర్స్. అంతేకాదండోయ్.. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బుచ్చి బాబు ని ఎలాంటి గిఫ్ట్ కావాలో అంటే ఏదైనా మంచి ఇల్లు.. కాదు ఏదైనా కారు లాంటిది కావాలా అంటూ ఆఫర్ ఇచ్చారట ఉప్పెన నిర్మాతలు. అంటే అదేదో యాడ్ లో చెప్పినట్టుగా బుచ్చి బాబు ని మైత్రి వారు లడ్డు కావాలా నాయనా అని అడుగుతున్నారట. మరి బుచ్చి బాబు ఇల్లు కోరుకుంటాడో? లేదంటే కారు కావాలంటాడో? అని ఇప్పుడు బుచ్చి బాబు ఫాన్స్ వెయిటింగ్ .